శ్రుతి ప్రియుడు రొనాల్డినోలా ఉన్నాడంటూ..!
శ్రుతి ప్రియుడు రొనాల్డినోలా ఉన్నాడంటూ..!

మాస్ మహారాజా రవితేజ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి అగ్ర కథానాయకుల సరసన కంబ్యాక్ ని ఘనంగా ప్లాన్ చేసింది శ్రుతిహాసన్. క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజై ఘనవిజయం అందుకుంది. శ్రుతికి ఇది పర్ఫెక్ట్ రీలాంచ్ అనే చెప్పాలి. వకీల్ సాబ్ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

తాజాగా శ్రుతి హాసన్ తన 35 వ పుట్టినరోజు సందర్భంగా బోయ్ ఫ్రెండ్ లుక్ ని రివీల్ చేయగా అది వైరల్ గా మారింది. మిడ్ నైట్ పార్టీలో అతగాడి హల్ చల్ గురించి ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు.

ఈ బర్త్ డే పార్టీలో తన స్నేహితురాలు తమన్నా భాటియా కూడా పాల్గొన్నారు. మిల్కీతో పాటు శ్రుతి సోదరి అక్షర హాసన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ పుట్టినరోజు వేళ తన ఇల్లుస్ట్రేటర్ ఆర్ట్ ను శ్రుతి బోయ్ ఫ్రెండ్ శంతను హజారిక షేర్ చేయగా అది మీడియాలో సెన్సేషన్ అయ్యింది. వెండి.. నలుపు .. బంగారు బెలూన్లు .. చాలా ప్రేమతో ఈ స్పెషల్ డేను జరుపుకున్నారు వీరంతా. రుచికరమైన చాక్లెట్ కేక్ ని కట్ చేశారు. ఇక తన పుట్టినరోజు వేళ కొత్త బోయ్ ఫ్రెండ్ తో ప్రత్యక్షమైన శ్రుతి గురించి వాడి వేడిగా చర్చ సాగుతోంది. శ్రుతి కొత్త బోయ్ ఫ్రెండ్ రొనాల్డినోలా.. బెక్ హాంలా హాట్ గా ఉన్నాడంటూ గాళ్స్ లో కామెంట్లు వినిపిస్తున్నాయ్. శంతను ఇండిపెండెంట్ ర్యాపర్.. ఇల్లుస్ట్రేటర్ గా కెరీర్ ని సాగిస్తున్నారు. శ్రుతికి మ్యూజిక్ బ్యాండ్ అభిరుచి ఉంది కాబట్టి చాలా కాలం నుంచి పరిచయం అని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here