శశికళ రాకతో హీటెక్కిన తమిళ పాలిటిక్స్
శశికళ రాకతో హీటెక్కిన తమిళ పాలిటిక్స్

తమిళనాడు సీఎం కావాల్సిన జయలలిత స్నేహితురాలు శశికళ ఐదేళ్ల క్రితం బీజేపీకి ఎదురెళ్లి అక్రమాస్తుల కేసులో జైలుపాలయ్యారు. నాలుగేళ్లు శిక్షను పూర్తి చేసుకొని ఇప్పుడు విడుదలయ్యారు. ఆమె విడుదలతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. శశికళ తమిళనాడుకు వస్తుండడంతో ఆమెకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె మేనల్లుడు దినకరన్ అన్ని ఏర్పాట్లు చేశాడు. చెన్నైలోని పోయేస్ గార్డెన్ లో శశికళకు భవనం కూడా నిర్మించాడు.

అయితే శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునేది లేదని సీఎం ఫళనిస్వామి ఇప్పటికే ప్రకటించారు. అన్నాడీఎంకేలోని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా శశికళ వెంట నడిచే పరిస్థితి లేదు. దీంతో తమిళ పాలిటిక్స్ చిన్నమ్మ స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

జయలలిత మరణం తర్వాత పార్టీని ప్రభుత్వాన్ని కంట్రోల్ లోకి తీసుకున్న శశికళ 2017 ఫిబ్రవరి 6న సీఎం కుర్చీ ఎక్కేందుకు అప్పటి సీఎం పన్నీర్ తో రాజీనామా చేయించారు. గవర్నర్ ను ఆహ్వానించమని కోరారు. అయితే ఫిబ్రవరి 14న ఆమెను అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో తన నమ్మిన బంటు అయిన మంత్రి ఫళనిస్వామిని సీఎంను చేసి శశికళ జైలుకు వెళ్లింది.

అనంతరం ఫళనిస్వామి పన్నీర్ సెల్వంలు కలిసిపోయి శశికళ బ్యాచ్ ను దూరం పెట్టారు. అనంతరం ఆమె మేనల్లుడు దినకరన్ సొంతంగా ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం’ అనే పార్టీ పెట్టి ఆర్కే నగర్ నుంచి పోటీచేసి గెలిచాడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఈ పార్టీ 6శాతం ఓట్లు సాధించింది.

శశికళ ఇప్పుడు బయటకు వస్తుండడంతో ఈ పార్టీ నుంచే రాజకీయం చేయబోతోందని తెలుస్తోంది. మరి బీజేపీ అన్నాడీఎంకే ఈమెను ఎలా ఎదుర్కొంటారన్నది వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here