మోడీ సర్కారుకు మింగుడు పడని నిర్ణయాన్ని తీసుకున్న పార్టీలు
మోడీ సర్కారుకు మింగుడు పడని నిర్ణయాన్ని తీసుకున్న పార్టీలు

బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ.. లోక్ సభ..రాజ్యసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం కీలకంగా భావిస్తారు. అయితే.. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి షాకిచ్చేందుకు వీలుగా విపక్షాలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తున్న రైతులకు సంఘీభావంగా నిలవలాని పలు పార్టీలు నిర్ణయించాయి. ఇందుకోసం తీసుకున్న నిర్ణయం మోడీ సర్కారుకు మింగుడుపడనిదిగా మారింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని పద్దెనిమిది పార్టీలు నిర్ణయించాయి. ఇందులో మోడీ సర్కారును తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలే ఉన్నాయి.

అదే సమయంలో.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ రాజకీయ పార్టీ లేకపోవటం గమనార్హం. రైతు చట్టాలకు వ్యతిరేకంగా దగ్గరుండి బంద్ చేయించిన తెలంగాణ అధికార పక్షం కానీ.. ఆ మధ్య వరకు మోడీ అంటే ఒంటికాలి మీద విరుచుకుపడిన టీడీపీ కానీ.. బహిష్కరణ నిర్ణయానికి దూరంగా ఉండటం గమనార్హం. బహిష్కరణ నిర్ణయాన్ని కాంగ్రెస్.. ఎన్సీపీ.. శివసేన.. తృణమూల్ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష నేతలు దీనిపై నిర్ణయాన్ని తీసుకున్నారు. రైతులకు మద్దతుగా రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించామన్నారు.

మోడీ సర్కారుకు షాకిచ్చే పార్టీల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీలతో పాటు.. బీజేపీ.. జనతాదళ్ (ఎస్) మాత్రం లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బహిష్కరించే పార్టీల జాబితాలో ఉంది. ఏయే పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాయంటే..
కాంగ్రెస్
ఎన్సీపీ
శివసేన
డీఎంకే
తృణమూల్ కాంగ్రెస్
నేషనల్ కాన్ఫరెన్స్
ఎస్పీ
ఆర్జేడీ
సీపీఎం
సీపీఐ
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
ఆర్ఎస్పీ
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ
ఎండీఎంకే
కేరళకాంగ్రెస్(ఎం)
ఆలిండియా యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here