నెల్లూరు లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
నెల్లూరు లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

పడారుపల్లి ఓ లాడ్జిలో ఇద్దరు గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హరీష్ లావణ్యలుగా గుర్తించారు. వీరు చిట్టమూరు మండలం మెట్టు గ్రామ సచివాలయంలో ఉద్యోగులుగా గుర్తించారు.
దీనితో ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇద్దరు ప్రాణాలు తీసుకోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. వీరుద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు. నెల్లూరు నగర శివారు ప్రాంతమైన నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రయినా హరీష్ లావణ్య ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలుచేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ లావణ్యలు చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. కానీ పెద్దలు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు. రెండు నెలల క్రితం లావణ్యకు మరో వ్యక్తితో వివాహం అయ్యింది. హరీష్ కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారట. ఆ మనస్తాపంతోనే ఇద్దరు ఇలా ప్రాణాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here