శృతిహాసన్ గతంలో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తనను ట్రోల్స్ కు గురిచేస్తోంది.
శృతిహాసన్ గతంలో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తనను ట్రోల్స్ కు గురిచేస్తోంది.

సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు అనుకోకుండా చెప్పిన మాటలుగాని సోషల్ మీడియాలో చేసిన ట్వీట్స్ గాని మళ్లీ ఏదో విధంగా మన లైఫ్ లో ఎదురుపడే పరిస్థితులు వస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ఆమె గతంలో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తనను ట్రోల్స్ కు గురిచేస్తోంది. 2017లో శృతి వెనకముందు ఆలోచించకుండా.. ఫ్యూచర్ గురించి ఆలోచన చేయకుండా ఓ ట్వీట్ చేసిందట. అయితే తాజాగా సలార్ ప్రాజెక్ట్ ఓకే చేసినప్పటి నుండి ఆ ట్వీట్ ట్రోల్ చేస్తోందట. మరి ఇంతకీ శృతి చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘ఇప్పుడప్పుడే ఫ్యూచర్ లో కన్నడ సినిమాలు చేసే ఆలోచన తనకు లేదని.. అలాగే కన్నడ సినిమాలకు సంబంధించి తనతో ఎవరూ చర్చలు జరుపలేదని శృతి ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

హీరోయిన్ శృతిహాసన్. ఆమె గతంలో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తనను ట్రోల్స్ కు గురిచేస్తోంది.అయితే ఆ ట్వీట్ చేసింది ఫ్యూచర్ సినిమాల గురించి కాదు. పొగరు సినిమాకు సంబంధించిన ట్వీట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సలార్ మూవీలో శృతిహాసన్ ఖరారు అయిన సంగతి తెలుసుకొని సోషల్ మీడియా యూజర్స్ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. కన్నడ సినిమాలే చేయను అన్నట్లుగా ట్వీట్ చేసిన శృతి.. మరి ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో ఎలా నటిస్తుంది..? అంటూ ట్రోల్ చేస్తున్నారట. ఈరోజుల్లో సోషల్ మీడియా చేతిలో ఉండటంతో ఎవరూ కూడా ప్రేక్షకుల నుండి తప్పించుకోలేరు. అందుకే ఓల్డ్ ట్వీట్ వలన కూడా శృతి ట్రోల్స్ కి గురవుతుంది. మరి దీనిపై శృతి స్పందిస్తుందా లేదా చూడాలి. ఇదిలా ఉండగా.. శృతిహాసన్ ఇప్పుడు సలార్ తో పాటు పలు ప్రాజెక్టులు ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో కూడా శృతి కీలకపాత్ర పోషించిన విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here