దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జనవరి 16నుండి నిర్విరామంగా కొనసాగుతుంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జనవరి 16నుండి నిర్విరామంగా కొనసాగుతుంది.

అక్కడక్కడా కొన్ని అపోహలు భయాలతో కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపిస్తున్నారు తప్ప మిగిలినది అంతా సజావుగానే సాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న స్టాఫ్ నర్సు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నం ఆంధ్రా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న పద్మజ శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో అదే ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.
అయితే మధ్యాహ్నం 1.30 సమయంలో ఫిట్స్లా వచ్చి కళ్లు తిరిగి కింద పడిపోయింది. శ్వాస తీసుకోవడంలో ఆమెకు ఇబ్బంది ఏర్పడింది. తీవ్ర అస్వస్థత పాలైన ఆమెను వెంటనే అదే ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె ప్రాణాలకి అయితే ఎటువంటి ముప్పు లేదని వైద్యులు చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోనితో అస్వస్థతకు గురైన స్టాప్ నర్సు ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఆరా తీశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా డీఎంహెచ్ ఎంవో డాక్టర్ సహాసినిని ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ వారం తరువాత మరణించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అంబాజీపేట మండలంలోని మాచవరం అగ్రహారం శివారు అంబేడ్కర్ నగర్ కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ సరెళ్ల శ్రీనివాస్ ఈ నెల 22న అమలాపురం ఏరియా ఆస్పత్రిలోకరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అకస్మాత్తుగా శుక్రవారం అతను కన్నుమూశాడు. వ్యాక్సిన్ వికటించడం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నివేదిక వచ్చాకనే అయన మృతికి అసలు కారణం తెలుస్తుంది అని వైద్యాధికారులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here