అధికార పార్టీలోని అసంతృప్తులకు బీజేపీ గాలం వేస్తోందా?
అధికార పార్టీలోని అసంతృప్తులకు బీజేపీ గాలం వేస్తోందా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం చేస్తున్న బీజేపీ ఈ క్రమంలోనే ఆ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ లోని అసంతృప్తులను లాగేసి చేర్చుకునే దిశగా అడుగులువేస్తోందని సమాచారం. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీతోనూ కమలం పార్టీ రాయబారాలు నడుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కమలం వైపు చూస్తున్నట్టు తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లోని నాగోల్ లో ఓ హైడౌట్ లో బీజేపీ ముఖ్యనేతలు చిన్నపరెడ్డితో భేటి అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న చిన్నపరెడ్డిని బీజేపీ గాలం వేసిందని.. ఆయనతో రహస్య భేటి నిర్వహించిందని.. ఒప్పుకుంటే నాగార్జున సాగర్ లో బీజేపీ తరుఫున టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన ఈ నేత బీజేపీలో చేరితే అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ అవకాశాలు పరిశీలిస్తోందని సమాచారం.

మొత్తం మీద అధికార పార్టీ ఎమ్మెల్సీ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం మాత్రం అధికార టీఆర్ఎస్ ను షేక్ చేస్తోంది. మరి ఇది నిజమా? లేక బీజేపీ పుట్టించిందా తెలియదుకానీ రాజకీయాలు అయితే వేడెక్కాయి.

అయితే తాను పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ చిన్నప్పరెడ్డి ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఆయన నోరుతెరిస్తే దీనిపై క్లారిటీ రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here