'ఉప్పేన' నుండి జల-జల-జలపాతం పాట.
'ఉప్పేన' నుండి జల-జల-జలపాతం పాట.

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ”ఉప్పెన” సినిమాని ఫిబ్రవరి 12న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచింది. ‘ఉప్పెన’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘ఉప్పెన’ నుంచి నాల్గవ పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ‘జల జల జలపాతం నువ్వు’ అనే మెలోడీ సాంగ్ ని రేపు ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ అందమైన పోస్టర్ ని వదిలారు. ఇందులో వైష్ణవ్ తేజ్ – హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరూ సముద్రం మధ్యలో పడవపై రొమాంటిక్ పోజ్ లో నిలబడి ఉన్నారు.

‘ఉప్పెన’ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని – వై. రవిశంకర్ – సుకుమార్ కలసి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here