'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్..!
'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్..!

యువ హీరో శర్వానంద్ – ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ”మహా సముద్రం”. ‘Rx 100’ ఫేమ్ అజయ్ భూపతి రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్ర థీమ్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని పెంచేసేసింది. ఈ క్రమంలో తాజాగా ‘మహాసముద్రం’ రిలీజ్ డేట్ ని చిత్ర బృందం ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘మహా సముద్రం’ సినిమా ఆగస్ట్ 19న (19.08.2021) విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో శర్వానంద్ – సిద్దార్థ్ ఇద్దరూ ఓ బోట్ పై కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘మహా సముద్రం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here