కేంద్రంలోని మోడీ సర్కారు ఎంత బలమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంతకీ.. ఇంత పెద్ద ఉద్యమానికి ఎవరో ఒకరు నాయకత్వం వహించాలి కదా? అతడెవరు? అతడెంత శక్తివంతుడు? అన్న ప్రశ్న వేసుకుంటే.. జాట్ నేత.. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాకేశ్ తికాయత్ తెర మీదకు వస్తారు. రెండు నెలలుగా ఘాజీపూర్ సరిహద్దుత్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అతడెంత శక్తివంతుడు అన్న దానికి ఒక్క ఉదాహరణ తెలిస్తే సరిపోతుంది.

ఉద్యమం అంతకంతకూ తీవ్రమైపోవటం.. రిపబ్లిక్ డే నాటి పరిణామాలతో కేంద్రం.. యూపీ సర్కారు సీరియస్ అయ్యింది. ఈ రెండు చోట్ల ఒకే ప్రభుత్వం ఉండటం.. కేంద్ర బలగాలు తక్షణమే రంగలోకి దిగాయి. ఈ నెల 28న (గురువారం) రైతులు ఆందోళన చేస్తున్న రైతులకు ఒక అల్టిమేటం జారీ చేశారు. రాత్రి 12 గంటల్లోపు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు రంగంలోకి దిగటమే కాదు.. ఎలా అయినా వారిని అక్కడి నుంచి పంపేయాలని డిసైడ్ అయ్యాయి. వారిని వెళ్లిపోవాలని రైతులపై ఒత్తిడిని పెంచారు.

ఇలాంటివేళ.. దీక్షా స్థలాన్ని ఖాళీ చేయటం తప్పించి మరో మార్గం లేదని రైతులు భావిస్తున్న వేళ.. తికాయత్ రంగంలోకి దిగారు. ఘాజీపూర్ చేరుకున్న ఆయన్ను.. భద్రతా బలగాలు ముందుకు కదలనివ్వలేదు. అతడిపై లుక్ అవుట్ నోటీస్ ఉందని.. వెంటనే లొంగిపోవాలని కోరారు. తికాయత్ వినకపోగా.. నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు తనకు మూడు రోజులు గడువు ఇచ్చారని.. అప్పటివరకు తనను నిర్బంధించే అధికారం లేదని చెప్పాడు. భద్రతా బలగాలతో సంఘర్షించకపోతే ఇన్నాళ్లు చేసిన పోరాటం వేస్ట్ అవుతుందని చెప్పటంతో రైతులు ఆయన మాటకు బదులుగా అక్కడే బైఠాయించటం షురూ చేశారు.

పరిస్థితిని జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఇష్యూ మరింత విషమంగా మారుతుందన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు.. తొందరపడొద్దని భద్రతా బలగాలకు సూచన చేశారు. ఇదే సమయంలో.. తికాయత్ ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. అందులో.. ‘బుల్లెట్లను నా శరీరంలో దించినా మీకు సరెండర్ కాను. ఈ క్షణం నుంచి.. ఇక్కడే నిరాహార దీక్ష మొదలు పెడుతున్నా. మా వూరి మంచినీళ్లు తప్పించి మరింకేమీ తాగను. నల్ల చట్టాలు తెచ్చి వేల మంది రైతులకు అన్యాయం చేస్తారా? పాలకులే ఈ దురాగతాలకు పాల్పడితే వారికి న్యాయం చేసేదెవరు?’’ అంటూ సూటిగా ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ వీడియో ఉద్యమాన్ని మరో మలుపు తిప్పటమే కాదు.. ఆ కన్నీళ్లను చూసిన వేలాది మంది రైతులు కదిలి.. ఉద్యమ స్థలికి వచ్చారు. హర్యానాలో అతి శక్తివంతమైన జాట్ వర్గానికి చెందిన తికాయత్ మాటలు.. వీడియో సందేశం అందరిని సంఘటితం చేయటమే కాదు.. వణికే చలిని లెక్క చేయకుండా.. తమ కోసం పోరాడుతున్న వ్యక్తికి దన్నుగా నిలవటం కోసం పంజాబ్.. హర్యానా.. ఢిల్లీకి చెందిన జాట్ రైతులు తీవ్ర ఆగ్రహానికి గురై.. దీక్షా స్థలికి చేరుకున్నారు. తికాయత్ మాటకు.. అతడి కన్నీటికి ఉన్న శక్తికి శాంపిల్ ఈ ఉదంతమని చెప్పాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here