మదనపల్లెలో చోటు చేసుకున్న దారుణ జంట హత్యల విచారణలో పోలీసులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
మదనపల్లెలో చోటు చేసుకున్న దారుణ జంట హత్యల విచారణలో పోలీసులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

కాళికనని చెప్పి.. కూతుర్ని చంపి.. నాలుక తినేసిన తల్లి పద్మజ
ఈ విషయాన్ని తండ్రి పురుషోత్తంనాయుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు నివేదిక వచ్చిన తర్వాత ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఇక.. అలేఖ్య తీరు కూడా తేడాగా ఉండటం గమనార్హం. తండ్రిని పలుమార్లు పాఠాలు చెప్పటం బంద్ చేసి.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించాలని కోరేదని తెలుస్తోంది.

కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని.. కరోనా కూడా అందుకో సూచికగా తరచూ చెప్పేదంటున్నారు. తాను చదివిన పుస్తకాల్లో ఆ విషయాలు ఉన్నట్లుగా ఆమె చెప్పేదని పోలీసుల విచారణలో తండ్రి చెప్పారంటున్నారు. అలేఖ్య భోపాల్ లో చదివే సమయంలో అక్కడి పలువురు మత ప్రబోదకుల ప్రసంగాలు.. రచనలకు ఆకర్షితురాలయ్యారని.. నిరంతరం వాటి అధ్యయనంలో మునిగి తేలేవారని చెబుతున్నారు.

భ్రమల్లో మునిగిపోయిన ఆమె.. తనలాంటి అమ్మాయి రూపంలో శివుడు అరుదుగా వస్తాడని భావించేదని.. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి..నమ్మించేదని చెబుతున్నారు. అందుకు తగ్గట్లే.. కళ్లను ఎర్రగా మార్చటం.. అంతలోనే మామూలుగా ఉండిపోవటం లాంటివి చూపించి.. తాను శివుడినని చెప్పేందంటున్నారు. గతంలో తాను ఒక కుక్కకు పునర్ జన్మను కల్పించానని చెప్పేదని పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here