క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల జోరు అంతకంతకు పెరుగుతోంది.
క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల జోరు అంతకంతకు పెరుగుతోంది.

ఓవైపు క్రీడా బయోపిక్ కేటగిరీ.. మరోవైపు ఒరిజినల్ స్టోరీస్ తో దర్శకరచయితలు సరికొత్త ఫ్లేవర్ ని వినోద ప్రియులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. దేవరకొండ.. సందీప్ కిషన్ .. ఇలా హీరోలంతా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తున్నారు.

చియాన్ వారసుడు ధృవ్ విక్రమ్ ఇప్పుడు క్రీడా నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నారు. అర్జున్ రెడ్డి  తమిళ రీమేక్ `వర్మ`తో హీరోగా పరిచయం అయిన ధ్రువ్ విక్రమ్ తదుపరి స్పోర్ట్స్ డ్రామాను లాక్ చేయడం చర్చనీయాంశమైంది. ఇది అతడి కెరీర్ మూడో సినిమా.

మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ఆటగాడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళనాడు గ్రామీణ ప్రాంతం నుండి క్రీడాకారుడిగా ఎదిగి.. చివరకు దేశం అత్యున్నత క్రీడా గౌరవాన్ని గెలుచుకోవటానికి కారకుడైన ప్రతిభావంతుడి కథతో తెరకెక్కుతోంది. ఆసియా క్రీడలలో భారత దేశానికి బంగారు పతకం సాధించిన కబడ్డీ ఆటగాడి నిజమైన కథ ఆధారంగా రూపొందించనున్నారు. ధ్రువ్ విక్రమ్ తన పాత్రపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

“నా తండ్రి నుంచి నేను అంకితభావం నేర్చుకున్నాను. నా తండ్రి నాకు నేర్పించిన ఈ లక్షణాన్ని ప్రతిబింబించే ఇద్దరు సెల్వరాజ్ సార్.. రంజిత్ సర్ లతో చేతులు కలపడం నాకు ఆశీర్వాదం“ అంటూ ధ్రువ్ విక్రమ్ ఎమోషన్ అయ్యారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభమవుతోంది. లిటిల్ రెడ్ కార్ సహకారంతో పా. రంజిత్ నీలం ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో డాడీ విక్రమ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసినదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here