సుప్రింకోర్టు తీర్పు నేపధ్యంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాగా రెచ్చిపోతున్నారు.
సుప్రింకోర్టు తీర్పు నేపధ్యంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాగా రెచ్చిపోతున్నారు.

రెండు రోజుల రాయలసీమ పర్యటనలో భాగంగా శుక్రవారం అనంతపురం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్నటి మార్చిలో జడ్పీటీసీ ఎంపిటీసీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవమైన స్ధానాలను సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. నిమ్మగడ్డ ప్రకటనతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. మామూలుగా సెన్సిటివ్ ప్రాంతాలంటే బాగా గొడవలు జరిగే అవకాశాలున్నవి లేకపోతే గొడవలు జరిగిన చరిత్రున్న ప్రాంతాలు.

సరే ఎలాగూ జిల్లాకు ఫ్యాక్షన్ జిల్లాగా పేరుంది. అయితే ఒకపుడున్న ఫ్యాక్షన్ ఇపుడు చాలావరకు తగ్గిపోయింది. ఇక సెన్సిటివ్ ప్రాంతాల విషయానికి వస్తే అప్పట్లో మధ్యలో ఆగిపోయిన ఎన్నికల్లో టీడీపీ తరపున నామినేషన్లు వేయటానికి చాలామంది నేతలు ముందుకే రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డే చెప్పారు. అధికారపార్టీని ఢీ కొనేంత శక్తి తమకు లేదు కాబట్టి తమ మద్దతుదారులంతా ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ గుర్తే.

కొన్ని చోట్ల గొడవలైనా చాలా చోట్ల పోటీలేక ఏకగ్రీవాలైన మాట వాస్తవం. క్షేత్రస్ధాయిలో వాస్తవం ఇలాగుంటే అప్పుడు ఏకగ్రీవాలైన ప్రాంతాలన్నింటినీ సెన్సిటివ్ ఏరియాలుగా గుర్తించాలని నిమ్మగడ్డ ప్రకటించటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో ప్రశ్నిస్తే నిమ్మగడ్డ మాత్రం సమాధానం చెప్పలేదు. ఇదే కాకుండా వైసీపీ నేతల ఆరోపణలపై మీడియా సంధించిన ఏ ప్రశ్నకు కూడా నిమ్మగడ్డ సమాధానం చెప్పలేదు. తాను మాట్లాడదలచుకున్నది మాట్లాడేసి సమాధానాలు చెప్పకుండానే వెళ్ళిపోయారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here