కల్లుతాగిన మంత్రులు.
కల్లుతాగిన మంత్రులు.

కల్లు.. సురాపానం.. దేవతలు తాగిన పానీయం..దీనికి ఎన్ని ఉపమానాలు ఉన్నా కూడా.. ఈ బీర్లు విస్కీలు కంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది అని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఇదంతా పక్కనపెడితే మన తెలంగాణ మంత్రులు కూడా ఓ పర్యటనలో కల్లు మండువా వద్ద ఆగి కల్లు తాగేసాశారు. తాటి ఆకుల్లో తనివీరా ఆస్వాదించారు.
తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ లు జనగామ జిల్లా రామవరం గ్రామంలో పర్యటించారు. అక్కడి సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కణలో పాల్గొన్నారు. అటుగా వెళుతూ గీత కార్మికులు ఉన్న మండువ వద్ద ఆగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే తాటి చెట్టు దిగి కల్లు తెస్తున్న గీత కార్మికుడు ఇద్దరు మంత్రులకు కల్లు ఇవ్వగా వారు తాటికమ్మలో కల్లు పోసుకొని తనివీతీరా తాగారు.

మొదటగా మంత్రి శ్రీనివాసగౌడ్ కల్లు తాగుతూ పీల్చేస్తుండగా.. పక్కనే ఉన్న మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు వేశాడు. మొత్తం కల్లు తాగేస్తాడు అని జోకులు వేసి నవ్వులు పూయించాడు. దీనికి కల్లు ప్రత్యేక చెప్పేందుకే తాను కల్లు తాగానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బదులిచ్చాడు. కూల్ డ్రింక్స్ కంటే కల్లు శ్రేష్టమైనదని.. దీనిపై చిల్లర కామెంట్స్ చేయొద్దని సూచించాడు.

ఇక ఉద్యోగులకు పీఆర్సీ లో అన్యాయం జరిగిందన్న విమర్శలను మంత్రులు తిప్పికొట్టారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 43శాతం ఫిట్ మెంట్ ఇస్తే నోరెళ్లబెట్టారని.. ఇప్పుడు అదే ప్రతిపక్షాలు చిల్లరమాటలు మాట్లాడుతూ కారుకూతలు కూస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ది మంచి మనసని.. ఆయన దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here