మీడియాసోషల్ కు ఎందుకు దూరంగా ఉంటావో నీ ఫ్యాన్స్‌కు చెప్పు.
మీడియాసోషల్ కు ఎందుకు దూరంగా ఉంటావో నీ ఫ్యాన్స్‌కు చెప్పు.

‘సమంత – నాగ చైతన్య..’ మొదటి సినిమాతో లవ్ లో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారంటే.. ఖచ్చితంగా చాలా విషయాలు సింక్ అయి ఉంటాయి. ఇక బయటకు కనిపించే కొన్ని విషయాల్లో వీరిద్దరూ ఒకేలా ఉంటారు. కానీ.. ఇంకొన్ని విషయాల్లో మాత్రం భిన్న ధృవాలుగా ఉంటారు. ఈ విషయం తాజాగా బయటపడింది.

ఆహా యాప్ కోసం సమంత ‘సామ్ జామ్’ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ పూర్తయింది. లాస్ట్ ఎపిసోడ్ కు చైతన్య గెస్ట్ గా వచ్చాడు. దీంతో.. భార్యాభర్తలు మంచి సందడి చేశారు. వీరి ముచ్చట్లు బాగానే వైరల్ అయ్యాయి.

ఈ వైఫ్ అండ్ హజ్బెండ్ క్వైట్ అపోజిట్ గా ఉండే అంశాల్లో సోషల్ మీడియా ఒకటి. ఈ విషయం వారు చెప్పడమే కాదు.. అందరికీ కనిపిస్తుంది కూడా. సోషల్ మీడియాలో సమంత రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంటే.. నాగచైతన్య సైకిల్ మీద వెళ్తున్నట్టుగా ఉంటాడు. సామ్ ఒక రోజులో చేసే పోస్టులు.. నాగ చైతన్య ఏడాది మొత్తం చేస్తాడట. ఈ విషయాన్ని లెక్కలతో సహా చెప్పింది సామ్.

సోషల్ మీడియాలో ఎవరు ఎంత యాక్టివ్ గా ఉంటారనే విషయం చెబుతూ.. తాను ఏడాదికి 1040 పోస్ట్‌లు చేస్తే.. చైతన్య 40 పోస్ట్‌లు చేశాడంటూ సమంత వెల్లడించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య అంత దూరం ఉందని చెప్పిన సమంత.. ‘మీడియాసోషల్ కు ఎందుకు దూరంగా ఉంటావో నీ ఫ్యాన్స్‌కు చెప్పు’ అని చైతన్యను అడిగింది.

దీనికి చైతూ స్పందిస్తూ.. ‘రిజర్వ్డ్గా ఉండటమే నాకు ఇష్టం. సినిమాలో కనిపిస్తాం కదా.. అది చాలు. ఆ తరువాత నాది పర్సనల్ లైఫ్. నా పర్సనల్ లైఫ్‌ను పబ్లిక్ చేయడం నాకు ఇష్టం ఉండదు.. అది నా స్పేస్. అలా ఉండటమే నాకు ఇష్టం’ అని చెప్పాడు. ఆ తర్వాత సమంతను ప్రశ్నించాడు. మరి నువ్వెందుకు ప్రతీ ఫొటోను షేర్ చేస్తావు? అని అడిగాడు.

దీనికి సమంత ఇలా బదులిచ్చింది. సినిమాల్లో కనిపించేది నేను కాదు. అవి పాత్రలు. నిజమైన సమంత ఏంటో తెలియాలని అలా చేస్తున్నాను.’ అని చెప్పుకొచ్చింది. అదే నిజమైన సమంత అంటూ నాగ చైతన్యకు రిప్లై ఇచ్చింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here