చట్టసభలో ప్రజాప్రతినిధులన్నాక ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి.
చట్టసభలో ప్రజాప్రతినిధులన్నాక ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి.

సమాజానికి దార్శనికత నేర్పాలి..కానీ ఈ ప్రజాప్రతినిధి మాత్రం ఏకంగా అసెంబ్లీలోనే దుకాణం తెరిచేశాడని ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు.. హోదాను ఉన్న చోటును మర్చిపోయి పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికాడనే విమర్శలు తెచ్చుకున్నాడు.
కర్ణాటక బడ్జెట్ సమావేశాల సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో దారుణమైన సీన్ వీడియోలకు చిక్కింది. అసెంబ్లీలో బిల్లులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు అడ్డంగా దొరికాడని హోరెత్తుతోంది. దీన్ని సోషల్ మీడియాలో.. మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాష్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే దీనిపై ప్రకాష్ వివరణ ఇచ్చాడు. మొబైల్ ఫోన్ లో మెమరీ నిండిపోగా.. అనవసరంగా స్టోరైన వీడియోలను డిలీట్ చేశానే తప్ప పోర్న్ వీడియోలు చూడలేదని వాదించారు.

అయితే సాధారణంగా అసెంబ్లీలోకి ఫోన్లు తీసుకెళ్లరు. నిషేధం.. మరి ఈ ప్రకాష్ ఎందుకు తీసుకెళ్లాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. నేనొక ముఖ్యమైన ప్రశ్న అడగడానికే మొబైల్ ను తీసుకెళ్లానని.. ఆసమయంలో ఇలా జరిగిందని.. రచ్చ చేయకండని ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ వివరణ ఇచ్చాడు.

2012లో ఇదే కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తూ బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ సవాది పట్టుబడ్డాడు. ఇప్పుడాయన బీజేపీ కేబినెట్ లో డిప్యూటీ సీఎం. అందుకే ఈ విషయంలో బీజేపీ పెద్దగా స్పందించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here