ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందించిన ప్రత్యేక యాప్ వివాదాస్పదమవుతోంది.
ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందించిన ప్రత్యేక యాప్ వివాదాస్పదమవుతోంది.

పంచాయితి ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదులు సమాచారం ఇచ్చి పుచ్చుకోవటం సందేశాలు పంపటం లాంటి అనేక ప్రయోజనాల కోసం ఎన్నికల కమీషన్ యాప్ ను రూపొందించినట్లు చాలామందికి తెలీనే తెలీదు. అటువంటి ఒక యాప్ రెడీ అయ్యిందని నిమ్మగడ్డ చెబితేనే అందరికీ తెలిసిందే. అంటే దీన్నిబట్టి అర్ధమవుతున్నదేమంటే యాప్ ను నిమ్మగడ్డ ప్రత్యేకంగా ఎక్కడో తయారు చేయించారని.

మామూలుగా ఇటువంటి యాప్ లు తయారీలో కేంద్రప్రభుత్వ సంస్ధ అయిన నేషనల్ ఇనఫర్మాటిక్ సంస్ధ లేకపోతే రాష్ట్రప్రభుత్వం ఆదీనంగాలో పనిచేసే ఐటి నిపుణులే తయారు చేస్తారు. కానీ ఇపుడు తయరయిన యాప్ విషయం నిమ్మగడ్డకు తప్ప ఇంకెవరికీ తెలీదు. పైగా ఈ యాప్ జియో తో కలిసి పనిచేస్తుందని అనంతపురంలో నిమ్మగడ్డ ప్రకటించటం ఇంకా విచిత్రం. ఎందుకంటే జియో అనేది ఓ మొబైల్ టెక్నాలజీ మాత్రమే. దీంట్లో ప్రైవేటు యాప్ లను యాక్సెస్ చేయటం సాధ్యంకాదని నిపుణులంటున్నారు.

మరాలంటి టెక్నాలజీతో ఎలక్షన్ కమీషన్ యాప్ ను రెడీ చేయటం వాడటంతోనే వివాదాస్పదమవుతోంది. జియో అంటే ముఖేష్ అంబానీదన్న విషయం అందరికీ తెలిసిందే. రిలయన్స్ యాజమాన్యంతో చంద్రబాబు నాయుడుకున్న బంధం ప్రపంచానికి అంతటికీ తెలుసని వైసీపీ నేతలంటున్నారు. కాబట్టి నిమ్మగడ్డ చెప్పిన ఈ యాప్ చంద్రబాబు ద్వారానే రిలయన్స్ వాళ్ళు రూపొందించారా ? అనే సందేహాల ను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

పైగా ఈ యాప్ లాగిన్ పాస్ వర్డ్ అందరి దగ్గరా లేదట. యాప్ యూజ్ చేయలంటే దాని లాగిన్ పాస్ వర్డ్ ముఖ్యులందరి దగ్గరా ఉంచటం సహజం. అలాంటిది ఈ యాప్ లాగిన్ పాస్ వర్డ్ కమీషన్లో కూడా చాలామందికి తెలీదట. పారదర్శకత కోసమే యాప్ రూపొందించినట్లు చెబుతున్న నిమ్మగడ్డ మరి దాని లాగిన్ పాస్ వర్డ్ ను మాత్రం తన దగ్గరే ఉంచుకోవటం ఏమిటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇదే విషయాలను మీడియా మిత్రులు అడిగితే తాను సమాధానం చెప్పదలచుకో లేదని చెప్పటం మరింత ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి నిమ్మగడ్డ రూపొందించిన యాప్ వివాదాస్పదమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here