నితిన్ మూవీ 'చెక్' నుండి కూడా ట్రైలర్ రాబోతుంది.
నితిన్ మూవీ 'చెక్' నుండి కూడా ట్రైలర్ రాబోతుంది.

గత వారం రోజులుగా టాలీవుడ్ లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. సంక్రాంతి పూర్తి అయినా కూడా సినిమా టీజర్ లు విడుదల తేదీలు ట్రైలర్ లు పాటలు పోస్టర్ లు ఇలా ఎన్నో రకాలుగా టాలీవుడ్ లో హడావుడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నితిన్ మూవీ ‘చెక్’ నుండి కూడా ట్రైలర్ రాబోతుంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో నితిన్ పాత్ర అత్యంత వైవిధ్యభరితంగా ఉంటుందని టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది.చెస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా ట్రైలర్ ను ఫిబ్రవరి 3 వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఈమద్య కాలంలో పదుల సంఖ్యలో సినిమాల విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ విడుదల సందర్బంగా చెక్ సినిమా విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరున్న చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాలో నితిన్ ను కొత్తగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై ఆసక్తి ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here