తెలంగాణలో త్వరలో జరుగుతున్న ‘నాగార్జున సాగర్’ ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది.
తెలంగాణలో త్వరలో జరుగుతున్న ‘నాగార్జున సాగర్’ ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది.

ఇప్పటికే దుబ్బాకలో ఓడిపోయిన టీఆర్ఎస్.. జీహెచ్ఎంసీలోనూ విజయానికి దూరమైంది. రెండుచోట్ల దెబ్బతిన్న గులాబీపార్టీకి ఇప్పుడు నాగార్జున సాగర్ కూడా పోతే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గట్టెక్కడం కష్టమనే వాదన ఉంది.

ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఈ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.

గతంలో ఇది కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ నుంచి నోములనర్సింహయ్య గెలిచారు. అయితే ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి.

ఈ క్రమంలోనే మళ్లీ జానారెడ్డినే ఇక్కడ కాంగ్రెస్ బరిలో దించుతోంది. మరోవైపు బీజేపీ ఏకంగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామాలపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో తోటి అనుచరులంతా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీలో ఉంచుదాం అంటే తన కొడుకునే నిలబెడుతానని స్పష్టంచేశారు. అలాకాదని.. తన అనుచరులు వేరే ఎవరైనా పోటీలో ఉంటామంటే వారికే తన మద్దతు ఉంటుందని తెలిపారు. వారసత్వ రాజకీయాలను తాను వ్యతిరేకం కాదని.. తన కొడుకు పోటీచేస్తే వైదొలుగుతానని జానా సంచలన ప్రకటన చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here