చిరంజీవి జనసేనలోకి రాబోతున్నారని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి
చిరంజీవి జనసేనలోకి రాబోతున్నారని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి

 జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలతో ఈ వార్తలు మొదలయ్యాయి. చిరంజీవి ఎప్పుడూ పవన్‌కల్యాణ్ శ్రేయస్సునే కోరుకుంటారని.. పవన్ కల్యాణ్‌ను సినిమాలు చేయమని కూడా చిరంజీవే సూచించారని.. అవసరమైతే ఆయన జనసేన పార్టీకి మద్దతు తెలుపుతారని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దీంతో చిరంజీవి జనసేనలోకి రాబోతున్నారని వార్తలకు మరింత బలం చేకూరింది. చిరంజీవి తప్పకుండా జనసేనలోకి వస్తారని 2024లో జనసేన సీఎం అభ్యర్థి ఆయనేనంటూ వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.

శుక్రవారం ఆయన మంగళగిరిలో కాపుసంక్షేమ సేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. ‘జనసేన కులాలకు మద్దతు ఇవ్వద్దు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే జనసేన ఉంది. అయితే నిజానికి కాపులను చాలా ఏళ్లుగా అన్ని రాజకీయపార్టీలు ఓటుబ్యాంక్‌గా చూస్తున్నాయి. 27శాతం జనాభా ఉన్నకాపులను ఓటుబ్యాంక్‌గా చూడటంతో వాళ్లు రాజకీయంంగా ఎదగడం లేదు. కాపులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం.. తాయిలాలు ప్రకటించడం అంటే వాళ్లను రాజకీయంగా దూరం చేయడమే. నేను ఓ కులానికి ప్రతినిధిని కాదు.. ఉద్ధానంలో కిడ్నీ బాధితుల కోసం పోరాటం చేశాను. అమరావతిలో దళితుల పక్షాన మాట్లాడాను’ అంటూ పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.

చిరంజీవి జనసేనలోకి చేరడంపై..

‘ప్రజారాజ్యం వ్యవస్థాపక సభ్యుల్లో నేను ఒకడిని. అయితే నేను ఇప్పటికీ అన్నయ్య అభిప్రాయాలను గౌరవిస్తాను. ఆయన జనసేనలోకి చేరతారా? లేదా ? అన్న విషయం ఆయన అభీష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన పార్టీలోకి వస్తారా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. జనసేన పార్టీ ఓ నిర్ధిష్ట లక్ష్యాలతో ఏర్పడింది. చిరంజీవి ఎప్పుడూ నా శ్రేయస్సునే కోరుకుంటారు. చిరంజీవి రాజకీయ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఆయన నైతిక మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు పవన్‌కల్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here