మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరోల్లో నెం.1 అనేందుకు మరే డౌట్ అక్కర్లేదు.
మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరోల్లో నెం.1 అనేందుకు మరే డౌట్ అక్కర్లేదు.

ఇప్పటికి ఎప్పటికి ఆయన మెగాస్టార్ గా టాలీవుడ్ లో ఉన్నత శిఖరాల్లో ఉంటాడు అంటూ అభిమానులు అంటూ ఉన్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా కూడా ఆయనకు అదే రేంజ్ లో వెల్ కంను జనాలు పలికారు. ఇప్పుడు ఆచార్య సినిమాతో మరోసారి చిరంజీవి స్టామిన ఏంటో అర్థం అయ్యింది. యంగ్ స్టార్ హీరోలు ఈమద్య కాలంలో యూట్యూబ్ రికార్డుల విషయంలో పోటీ పడుతున్నారు. కాని సీనియర్ హీరోలు మాత్రం ఈ రికార్డుల విషయంలో చాలా వెనుక ఉన్నారు. కాని చిరంజీవి మాత్రం యంగ్ స్టార్ హీరోలతో పోటీ అన్నట్లుగా దూసుకు పోతున్నారు.ఆచార్య సినిమా టీజర్ విడుదల అయ్యింది. అతి తక్కువ సమయంలోనే అయిదు మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడంతో పాటు పది మిలియన్ ల వైపుకు దూసుకు వెళ్తోంది. ఇక టీజర్ లైక్స్ విషయానికి వస్తే ఇప్పటికే 500కే లైక్స్ వచ్చేశాయి. అతి త్వరలోనే మిలియన్ లైక్స్ కు చేరడం ఖాయం అన్నట్లుగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం 12 గంటల్లోనే అత్యధిక వ్యూస్ ను రాబట్టడంతో పాటు లైక్స్ విషయంలో కూడా యంగ్ స్టార్ హీరోలకు సమానంగా దూకు పోతున్న ఆచార్య టీజర్ ముందు ముందు మరెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇక కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతుంది. ఇక సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here