ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది.
ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది.

పంచాయితి ఎన్నికల నిర్వహణ నేపధ్యంలో రోజు రోజుకు ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోంది. ఈ పరిస్ధితికి ఎవరిది తప్పని తేల్చటం అంత ఈజీ కాదు. అయితే ప్రభుత్వంతో పాటు నిమ్మగడ్డలో కూడా తప్పులున్నాయన్న విషయం మాత్రం చెప్పవచ్చు. తానొక్కడే సర్వం సహా అధికారిని అనే అహం నిమ్మగడ్డలో బాగా కనబడుతోంది. ఎలక్షన్ కమీషన్ అన్నది రాజ్యాంబద్దమైన సంస్ధని తాను రాజ్యాంబద్దమైన అధికారాలు కలిగిన వ్యక్తినని తరచూ చెబుతుండటమే దీనికి నిదర్శనం.
ఇక్కడ నిమ్మగడ్డ మరచిపోయిందేమిటంటే ఎలక్షన్ కమీషనర్ మాత్రమే కాదు రాజ్యాంగబద్దమైన అధికారి. ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్దంగా ఏర్పడిందే. జగన్మోహన్ రెడ్డి కూడా రాజ్యాంగబద్దంగా ఎంపికైనా ముఖ్యమంత్రే అని నిమ్మగడ్డ గుర్తించటానికి ఇష్టపడటం లేదని అనుమానంగా ఉంది. అందుకనే ప్రభుత్వం-కమీషన్ మధ్య ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అధికారాలు బాధ్యతలు రాజ్యాంగ విధుల గురించి ఇంతగా మాట్లాడుతున్న నిమ్మగడ్డ మరి 2018 జూలైలోనే జరగాల్సిన ఎన్నికలను అప్పట్లో ఎందుకు నిర్వహించలేదో చెబితే బాగుంటుంది.

అంతగా లేని కరోనా వైరస్ ను బూచిగా చూపించి మొన్నటి మార్చిలో జరుగుతున్న ఎన్నికలను ప్రభుత్వంతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఏకపక్షంగా వాయిదా వేయటమే నిమ్మగడ్డ చేసిన తప్పు. అక్కడి నుండి రెండువైపులా గొడవలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా సుప్రింకోర్టు తీర్పుతో జరుగుతున్న ఎన్నికల విషయంలో అయినా నిమ్మగడ్డ సంయమనం పాటించటం లేదు. తీర్పు రాగానే కలెక్టర్లను ఎస్పీపై బదిలీ వేటు వేశారు. సరే ఈ చర్యను అందరు ఊహిస్తున్నదే అని అనుకుందాం.

అక్కడితో ఆగకుండా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది గిరిజాశంకర్ పై అభిశంసనకు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను బాధ్యతల నుండి తప్పించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలంటూ ప్రభుత్వానికి లేఖరాశారు. ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ చర్యలన్నీ నిమ్మగడ్డ పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే చెబుతున్నాయి. చివరకు ఏకగ్రీవాలను కూడా నిమ్మగడ్డ అడ్డుకుంటుండమే విచిత్రంగా ఉంది.

ఇదే సమయంలో మంత్రులు ఎంపి విజయసాయిరెడ్డి కూడా నిమ్మగడ్డను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు. పంచాయితి ఎన్నికలకు మ్యానిఫెస్టో విడుదల చేయకూడదని తెలిసి కూడా చంద్రబాబునాయుడు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అయినా చంద్రబాబుపై నిమ్మగడ్డ ఎటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేయలేదు. అదే ప్రభుత్వ విషయానికి వచ్చేసరికి తనంతట తానుగా చర్యలకు రెడీ అయిపోతున్నారు. మరి నిమ్మగడ్డ ఆలోచనల్లో ఇంత వైరుద్యం కనబడుతోంది కాబట్టే ఇన్ని గొడవలవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here