దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ దేశం మొత్తం తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంటే.. వైద్యులు పారిశుధ్య కార్మికులు పోలీసులు.. ఇలా ఫ్రంట్ లైన్ వారియర్స్ కొవిడ్ పై యుద్ధం ప్రకటించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎంతో మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ ప్రాణాలను అర్పించారు.అలాంటి వారియర్స్ అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని మెగాపవర్ స్టార్ రామ్చరణ్ సతీమణి ఉపాసన సూచించారు. ఆమె తాజగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. శుక్రవారం వ్యాక్సిన్ తీసుకున్న ఉపాసన.. ఇందుకు సంబంధించిన ఫొటోలను లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా భావిస్తున్నానని అన్నారు. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని అన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లంతా ముందుకు వచ్చి సురక్షితమైన వ్యాక్సిన్ తీసుకోవాలని ఉపాసన సూచించారు. కరోనా మహమ్మారిపై జాతిగా మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here