సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున జాంబిరెడ్డి.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున జాంబిరెడ్డి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అ! కల్కి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ దర్శకత్వంలో విడుదలకు రెడీ అయిన సినిమా జాంబిరెడ్డి. తేజ సజ్జా ఆనంది దక్షా నగర్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇదివరకే అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్న తమ ‘జాంబిరెడ్డి’ని ఫిబ్రవరి 5న థియేటర్లకు తీసుకొస్తామని చెప్పారు. అయితే మొదటిసారి జాంబిస్ నేపథ్యంలో కొత్త ప్రయోగానికి తెరలేపాడు డైరెక్టర్ ప్రశాంత్. టాలీవుడ్ చరిత్రలోనే జాంబిస్ కాన్సెప్ట్ తో వస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. ఈ జాంబిరెడ్డి మూవీ జాంబీస్ తో పాటు కరోనా నేపథ్యం కూడా మిక్స్ చేసి రూపుదిద్దుకుంది.అయితే ఈ సినిమా ఫస్ట్ బైట్ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసి సినిమా పై ఆసక్తిని పెంచేసింది. ‘జాంబిరెడ్డి టీజర్ అదిరింది. నాకు చాలా నచ్చింది. విజువల్స్ మేకింగ్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మొదట్లో నాకు ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు సినిమాగా ఎలా తీస్తారు అనుకున్నాను. కానీ నా డెసిషన్ తప్పని ప్రూవ్ చేస్తూ బాగా తీశారు’ అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఈ సినిమా అన్నివిధాలా విడుదలకు సన్నద్ధం అయింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది జాంబిరెడ్డి. చూస్తుంటే ఈ సినిమాలో భయానకంతో పాటు కామెడీ కూడా వర్కౌట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జాంబిరెడ్డి ట్రైలర్ ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసింది. చూడాలి మరి ఫస్ట్ జాంబి బ్యాక్ డ్రాప్ తెలుగు మూవీ ఎలా ఉండబోతుందో..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here