చిత్తూరు జిల్లా:మదనపల్లె జంట హత్యల కేసులో.
చిత్తూరు జిల్లా:మదనపల్లె జంట హత్యల కేసులో.

నిందితుల తరపున వాదించేందుకు సాక్షాత్తు సుప్రీం కోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచార్య ముందుకొచ్చారు. డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రొఫెసర్ పురుషోత్తంనాయుడి దగ్గర విద్యనభ్యసించిన పూర్వ విద్యార్ధుల అభ్యర్ధన మేరకే పీవీ కృష్ణమాచార్య కేసును వాదించేందుకు సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది.

ఈకేసు విషయంలో తన జూనియర్‌ రజనీ ద్వారా వివరాలను అడ్వకేట్ కృష్ణమాచార్య సేకరిస్తున్నారు. కేసులో పూర్వాపరాలు తెలుసుకునేందుకు రజనీ మదనపల్లి జైలులో ఉన్న పద్మజ, పురుషోత్తమ్‌నాయుడ్ని కలిసారు. ఘటనకు సంబంధించిన వివరాల్ని వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.

మదనపల్లి జంట హత్యల కేసులో నిందితుల తరపున వాదించేందుకు ఒప్పుకున్న న్యాయవాది పీవీ కృష్ణమాచార్య ఇప్పటికే సంచలనం సృష్టించిన దిశ కేసులో ఎన్‌కౌంటర్‌కి వ్యతిరేకంగా కోర్టులో తన వాదనలు వినిపిస్తున్నారు.

ఇదిలావుంటే…
ఉన్నత చదువులు చదివిన అలేఖ్య మూఢనమ్మకాలకు ప్రభావితురాలైంది. మంచి చదువు చదువుకుని.. మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తున్న అలేఖ్య ప్రముఖుల ప్రసంగాలకు ఆకర్షితురాలై.. వాటినే అధ్యయనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రముఖుల ప్రసంగాలు వింటూ, రచనలు చదువుతూ చివరికి వారు తమను తాము దేవుళ్లుగా ఊహించుకుంటూ భ్రమల్లోకి వెళ్లి పోయారని భావిస్తున్నారు. తనలా అమ్మాయి రూపంలో శివుడు రావటం అరుదని భావించి అలేఖ్య, తన మూఢవిశ్వాసాలను తల్లిదండ్రులు నమ్మేలా చేశారు.

చివరకు ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా అదే మూఢ విశ్వాసాలతో భయానక ఘటనలకు పాల్పడ్డారు. ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చారు. వీరిద్దరి మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వారికి జైలు లాంటి వాతావరణంలోనే చికిత్స చేయాల్సిన అవసరం ఉందని, అందరితో పాటు ఉంచితే ప్రమాదమని పేర్కొన్నారు. అందుకోసం వారికి విశాఖ ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి వైద్యం కోసం సిఫార్సు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here