రావిపాడు లో.. రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు యువకులను కాపాడి ఆస్పత్రికి తరలించిన వైనం
చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు విప్పర్ల గ్రామానికి వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో రావిపాడు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.నకరికల్లు నుండి నరసరావుపేట కు విచ్చేస్తున్న నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డాllచదలవాడ అరవింద బాబు ప్రమాదాన్ని చూసి కారు ఆపి యువకులను ఆస్పత్రికి తరలించే ఏర్పాటును దగ్గరుండి చేశారు.