ధినేష్ కుమార్..జిల్లా కలెక్టర్ కామెంట్స్...
ధినేష్ కుమార్..జిల్లా కలెక్టర్ కామెంట్స్..

గుంటూరు:మొదటి విడతలో భాగంగా తెనాలి డివిజన్ లో 337 పంచాయితీలకు 3547 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశాం.

రెండు రోజుల్లో నామినేషన్ ల 213 సర్పంచ్ లు 569 వార్డు మెంబర్ల నామినేషన్ లు దాఖలయ్యాయి.

రేపు చివరి రోజు కావడంతో ఎక్కువ నామినేషన్ లు వచ్చే అవకాశం ఉంది.

శాంతి యుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రత్యేక జోనల్ అధికారులను,ఫ్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశాం.

ప్రతి మండలానికి ఇద్దరు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లు ఉంటారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడితే తక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేశాం.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే జిల్లాలో 407 లైసెన్స్ గన్ లను స్వాదీనం చేసుకున్నాం.

జిల్లాలో 38 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశాం.

దుగ్గిరాలలో ఓటు కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్లై చేసుకున్న అప్లికేషన్ ను విఆర్ఒ రిజెక్ట్ చేశారు.

ఓటు హక్కు కల్పించడం పై విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here