పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అడిషనల్ ఎస్పీ ,మరియు నరసరావుపేట సూపరింటెండెంట్ ఆదేశాలమేరకు బొల్లాపల్లి మండలం ఘడితండ గ్రామ గుట్లపల్లి లాకులు వద్ద గల ఫారెస్ట్ లో నాటుసారా కాస్తున్నరు అని సమాచారం మేరకు వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ ci శ్రీనివాసరావు ,ఈపురు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ ci అరుణ కుమారి. నాటు సారా బట్టిలపై దాడి చేశారు… ఈ దాడిలో 25 ప్లాస్టీక్ రమ్ములు లో నిల్వ చేసిన 4 వేల బెల్లపు లీటర్లను ద్వంసం చేసి సుమారు 40 లీటర్ల సారాయి ని సీజ్ చేసి రన్నింగ్ బట్టి నీర్వహిస్తున్న 8 మంది పై కేసులు నమోదు చేసి త్వరలో అరెస్ట్ చేస్తాము అని ఈపురు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ ci అరుణ కుమారి.