కష్టాల్లో ఉన్న నా ఉయ్యూరు కుటుంబ సభ్యులను ఆదుకోవడం నా బాధ్యతగా భావిస్తా.
కష్టాల్లో ఉన్న నా ఉయ్యూరు కుటుంబ సభ్యులను ఆదుకోవడం నా బాధ్యతగా భావిస్తా.

కష్టాల్లో ఉన్న నా ఉయ్యూరు కుటుంబ సభ్యులను ఆదుకోవడం నా బాధ్యతగా భావిస్తా ..ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ గారు

ఉయ్యూరు పట్టణంలోని 18 వార్డు మరియు 7 వార్డులో నజీర్, కిషోర్, అయ్యప్ప ఆధ్వర్యంలో 3 పేద కుటుంబాలకు చెందిన వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కారణంగా రాజేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15500 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణ ప్రజలతో నాకు గత 45 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలతోను, 25 సంవత్సరాలుగా రాజకీయంగా అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నాయని, వీరందరూ నన్ను వారి సొంత బిడ్డవలే భావిస్తారని, రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు పట్టణాన్ని నేను సర్పంచ్ గా మరియు నా భార్య శ్రీమతి భ్రమరాంబ గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు అభివృద్ధి చేశామని , సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ మొదలగు అభివృద్ధి పనులను చేసానని, నేను చేసిన అభివృద్ధి పనులు ఉయ్యూరు ప్రజలు ఇప్పటికి గుర్తుంచుకొని నాకు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుందని రాజేంద్రప్రసాద్ అన్నారు. అలాగే నా ఉయ్యూరు ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను వారి కుటుంబంలో ఒక్కడిగా ఆదుకుంటానని, నేను పదవిలో ఉన్నా లేకపోయినా ఉయ్యూరు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యేనిగళ్ల కుటుంబరావు,కూనపరెడ్డి శ్రీనివాసరావు,చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, అబ్దుల్ నజీర్,రాజులపాటి ఫణి,జంపన శ్రీనివాస్, గోరంట్ల నరేంద్ర, పల్యాల శ్రీనివాస్,సుంకర అయ్యప్ప,పెన్నేరు కిషోర్,అబూ,వికృతి రాజా,స్వాతి జబ్బార్,మనోజ్, భాషే తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here