కారంపూడి చెక్పోస్ట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ.
కారంపూడి చెక్పోస్ట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ.

గుంటూరు జిల్లా కారంపూడి లో జరిగిన దొంగతనం కేసులో వీడిన చిక్కుముడి నలుగురు నిందితుల అరెస్ట్

మొత్తం నలుగురు నిందితులు కాగా వారిలో ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కాగా మరో ఇద్దరు కర్నూలు జిల్లా మహానంది మండలానికి చెందిన వారుగా తెలుస్తుంది

నిందితులను చాకచక్యంగా పట్టుకొని 4సెల్ ఫోన్లు 20వేల నగదు రికవరీ చేసిన కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ మరియు వారి సిబ్బంది కి డిఎస్పీ జయరాం ప్రసాద్ చేతుల మీదుగా రివార్డులు అందజేత

(నిందితుల వివరాలు)
మొదటి నిందితుడు కె ఎన్ మారుతి వయస్సు 24.
.తండ్రి పేరు నరసింహ మూర్తి మాది కొట్లాపూర్ పోస్ట్ హుబ్లీ మధుగిరి తాలూకా తుంకూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం

(అదే గ్రామానికి )రెండవ ముద్దాయి టి కుమార్ . తండ్రి పేరు తిమ్మన్న. వయసు 28 సంవత్సరాల .
. మూడువ నిందుతుడు .
బూసీగల్లా శేషు (అలియాస్ కిట్టు ) వయస్సు 28 సంవత్సరాలు
తండ్రి పేరు నాగ శేషు గోపవరం గ్రామం మహానంది మండలం కర్నూలు జిల్లా.
..
అదే గ్రామానికి చెందిన నాలుగో నిందితులు నల్లబోతుల మధు అలియాస్ బరిగొడ్ల మధు . వయస్సు32 సంవత్సరాలు తండ్రి పేరు మద్దిలేటి.)

(నిందితులకు పరిచయం ఎలా అంటే 🤝)

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మారుతి కుమార్ అనేవారికి మడకశిర అనే ప్రాంతంలో బట్టల షాపు పెట్టుకుని జీవిస్తున్నారు వారికి కర్నూలు జిల్లా మహానంది కి చెందిన శేషు (కిట్టు) బి మధు అను ఇద్దరు అరటికాయలు వ్యాపారం చేస్తున్నారూ ఒక సందర్భంలో వారి వద్ద బట్టల కొనటానికి వెళ్లిన వీరికి పరిచయం ఏర్పడి వారు స్నేహితులు మారారు వారికి తాము చేసే పని వళ్ల లాభం రాకపోవడంతో చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీరందరూ చేడు మార్గంలో డబ్బులు సంపాదించాలని అని అనుకొనగా దానికి మిగతా వారు కూడా అంగీకరించారు తమ ప్రాంతాల్లో ఏమి చేసినా పోలీసుల తో ఇబ్బంది తప్పదని భావించి అందుకోసం ఇంకా ఎక్కడైనా కానీ దొంగతనం చేద్దాం అనుకోని వాళ్లలో వాళ్లు ఏ ఊర్లో ఏ ప్రాంతాల్లో దొంగతనానికి అనుకూలంగా ఉంటుందని అందరూ చర్చించుకొని అందులో ఇద్దరు అప్పుడప్పుడు అరటికాయలు అమ్ముకుంటూ తిరిగిన ప్రాంతమైన గుంటూరు జిల్లా కారంపూడి అనువైందని భావించి కారంపూడి పట్టణంలోని పోలీస్ కాంప్లెక్స్ నందు చేదాం అని 3 షాప్ లను ఎంచుకొని 11.01.2021 తేదీన ఉదయం ఏడు గంటలకు తమంప్రాంతం నుంచి బయలుదేరి కారంపూడి వచ్చి పోలీస్ కాంప్లెక్స్లో జనం ఏ విధంగా ఉంటారు షాప్ లో పరిస్థితులు ఎలా ఉంటాయి అని అన్ని రకాల గా రెక్కీ నిర్వహించి అదే రోజు అర్ధరాత్రి దాటాక 2. నుంచి 3 గంటల మద్యలో చీకటి సమయంలో అక్కడ వరసగా ఉన్నటువంటి శ్రీ విజ్ఞేశ్వర అన్నపూర్ణ సెల్ పాయింట్ మరియు శ్రీ నక్షత్ర ఫ్యాషన్ దివ్య షూ మార్చు షాపులలో దొంగతనానికి పూనుకొని షాపులకు వేచి ఉన్న సటర్ లని కండువాలు ఉపయోగించి చేతులతో బలంగా లాగి లోపలకి దూరి అందులోని మూడు షాపుల్లో కలిపి 20 వేల రూపాయల నగదు మరియు 4 సెల్ ఫోన్ లు దొంగిలించారు
కర్ణాటక రాష్ట్రానికి చెందిన కె A 51 AA 40 84 అనే కారు లో వాడినట్లు తెలుసుకున్న కారంపూడి ఎస్సై నిందితులతో పాటు కారు ని కూడా స్వాధీనం చేసుకున్నారు చోరీ కేసులో నిందితులను పట్టుకోవడం మరియు దొంగిలించిన సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ మరియు వారి సిబ్బందిని గురజాల డి.ఎస్.పి మరియు గుంటూరు రూరల్ ఎస్పీ అభినందించారు అనంతరం గురజాల డి.ఎస్.పి శ్రీ విజయ రామ్ ప్రసాద్ చేతుల మీదుగా వారికి రివార్డులు అందజేశారు
నిందితులతో ఐపీసీ సెక్షన్ 461 380 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు గురజాల డిఎస్పి జయ రాం ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో గురజాల రూరల్ సీఐ ఉమేష్ కుమార్ కృష్ణ మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here