నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలనం
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలనం

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలనం: మంత్రులు , సలహాదారులకు ప్రభుత్వ వాహనాలు కట్.

ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో లేఖ రాశారు. మంత్రులు, సలహాదారులు ప్రభుత్వ వాహనాలు వినియోగంపై ఆంక్షలు విధించారు. దీనిని మరో కీలకమైన, వివాదాస్పదమైన లేఖగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన దీనిని పూర్తిగా అమలు చేయాలని సీఎస్‌కు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకి మంత్రులు, సలహాదారులు, ప్రభుత్వోద్యోగులు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని నిమ్మగడ్డ లేఖలో ప్రస్తావించారు.

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటనల్లో ఉద్యోగులు పాల్గొనరాదని సూచించారు. అంతకుముందు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుల ధృవీకరణ పత్రాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

పంచాయతీ ఎన్నికల్లో పాత కుల ధృవీకరణ పత్రాలకు అనుమతించాలని ఆదేశించింది. కొత్త ధృవీకరణ పత్రాలు కావాలని ఒత్తిడి చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొత్త సర్టిఫికెట్ల సమర్పణకు నిర్ణీత సమయం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

పోటీ చేసే వారికి ఫాస్ట్ ట్రాక్ విధానంలో కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఎస్ఈసీ సూచించింది. పోటీ చేసే అభ్యర్ధులు బకాయిలు చెల్లింపునకు వస్తే వెంటనే తీసుకోవాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here