కేంద్రం బడ్జెట్‌ 2021-22ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
కేంద్రం బడ్జెట్‌ 2021-22ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

♦బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్‌ తయారు చేశాం :కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

♦ఎప్పుడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్‌ తయారు చేయడం జరిగింది.

♦ లాక్‌డౌన్‌ పెట్టకపోయి ఉంటే భారతదేశం భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేది.

♦అత్యవసర సేవల రంగంలో పనిచేసిన వారందరూ తమ ప్రాణాలొడ్డి పనిచేశారు.

♦విద్యుత్‌, వైద్యారోగ్యం, బ్యాంకింగ్‌, అగ్నిమాపక సిబ్బంది గొప్పగా పనిచేశారు.

♦ఇది ప్రజల బడ్జెట్ : నిర్మలాసీతారామన్

♦లాక్ డౌన్ వల్ల నష్టాన్ని తగ్గించగలిగాం-నిర్మలాసీతారామన్

♦ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ద్వారా మిని బడ్జెట్ ను ప్రవేశపెట్టాం-నిర్మలాసీతారామన్

♦అత్యవసర సేవల్లో పనిచేసే వారు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు.

♦కోవిడ్ తో దేశ ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి.

♦రవీంద్రనాధ్ ఠాకూర్ సూక్తిని చదివి వినిపించిన నిర్మలాసీతారామన్.

♦3 ఆత్మనిర్భర్ ప్యాకేజీలు, తర్వాత చేసిన ప్రకటనలు ఆర్థిక వ్యవస్థను కాపాడాయి : నిర్మలాసీతారామన్

♦భారత్‌లో ఇప్పటికే 2 వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చాం

♦భారత్‌లో మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి: నిర్మలాసీతారామన్

♦వ్యాక్సిన్ల కోసం కృషిచేసిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు

♦ప్రపంచ దేశాలకు భారత్‌ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది : నిర్మలాసీతారామన్.

♦ఈ దశాబ్దానికి ఇదే మొదటి బడ్జెట్ : నిర్మలాసీతారామన్

♦ఆర్థిక వ్యవస్థ చరిత్రలో 3సార్లు మాత్రమే జీడీపీ మైనస్‌లో ఉంది.

♦2021 సంవత్సరం భారతదేశ చరిత్రలో మైలురాయిగా నిలవనుంది : నిర్మలాసీతారామన్

♦ఆత్మనిర్భర్ భారత్ కొత్త ఆలోచన కాదు..పురాతన కాలం నుంచి భారత్ ఆర్థిక రంగంలో ముందుంది.

♦బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి రూ.64,180 కోట్లతో ప్రత్యేక నిధి : నిర్మలాసీతారామన్

♦దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్ధారణ కేంద్రాలు

♦నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానాల పథకం : నిర్మలాసీతారామన్

♦దేశంలో బీఎస్‌ఎల్-3 సౌకర్యాలతో 9 ల్యాబ్‌లు ఏర్పాటు

♦4 ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌లు ఏర్పాటు : నిర్మలాసీతారామన్

♦2021కి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయి : నిర్మలాసీతారామన్

♦సమ్మిళిత వృద్ధే లక్ష్యంగా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించాం

♦ఆరోగ్య రంగంలో 64,180 కోట్లతో ప్రత్యేక నిధి : నిర్మలాసీతారామన్

♦పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్ మిషన్ : నిర్మలాసీతారామన్

♦ అర్బన్ రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87 వేల కోట్లు

♦ఘనవ్యర్థాల నిర్వహణకోసం స్వచ్ఛభారత్ అర్బన్ : నిర్మలాసీతారామన్

♦ఐదేళ్లలో స్వచ్ఛభారత్ అర్బన్‌ కోసం రూ.1,41,670 కోట్లు.

♦దేశంలోని వాహనాల ఫిట్‌నెస్ పరీక్షకు ప్రత్యేక విధానం : నిర్మలాసీతారామన్

♦వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల కాలపరిమితి

♦ కాలపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్ పరీక్షకు వెళ్లాలని.

♦ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి రూ.2,23,846 కోట్లు : నిర్మలాసీతారామన్

♦ఆత్మనిర్భర్ భారత్ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ.1.97 లక్షల కోట్లతో ప్రత్యేక నిధి

♦ఎంపిక చేసిన 13 రంగాల్లో పీఎల్ఐ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిధులు.

♦మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట : నిర్మలాసీతారామన్

♦మౌలిక వసతులకు ఆదాయ వనరుల కోసం ప్రత్యేక సంస్థ

♦తయారీ రంగంలో మద్దతు కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థ

♦ప్రత్యేక ఆర్థిక వ్యవస్థకు రూ.20 వేల కోట్ల మూలధనం : నిర్మలాసీతారామన్

♦వచ్చే మూడేళ్లలో అందుబాటులో 5 లక్షల కోట్ల రుణాలు

♦ఐదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు

♦కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు : నిర్మలాసీతారామన్

♦అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి : నిర్మలాసీతారామన్

♦పశ్చిమ బెంగాల్‌లో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి

♦2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు : నిర్మలాసీతారామన్

♦ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్.

♦ కరోనా సమయంలో రూ.27.1 లక్షల కోట్లతో ప్యాకేజీలు ప్రకటించాం : నిర్మలాసీతారామన్

♦ప్యాకేజీలు ఆర్థిక వ్యవస్థను కాపాడి సంస్కరణలకు ఊతమిచ్చాయి

♦బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు :

♦ఇప్పటికే 2 వ్యాక్సిన్లు ఇస్తున్నాం.. త్వరలో మరో 2 టీకాలు రాబోతున్నాయి : నిర్మలాసీతారామన్

♦పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం.

♦గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ లో పెట్టుబడుల ఉపసంహరణ : నిర్మలాసీతారామన్.

♦విద్యుత్‌ రంగంలో సంస్కరణలు : నిర్మలాసీతారామన్

♦విద్యుత్‌ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థలు తీసుకొస్తాం.

♦రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం : నిర్మలాసీతారామన్

♦ హైడ్రోజన్‌ ఎనర్జీపై దృష్టి. ఇండియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి రూ.1624 కోట్లు. నౌకల రీసైక్లింగ్‌ సామర్థ్యం పెంపు.

♦ మరో కోటి మందికి ఉజ్వల పథకం : నిర్మలాసీతారామన్

♦రానున్న మూడేళ్లలో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా.

♦జమ్మూకశ్మీర్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌. మరో కోటి మందికి ఉజ్వలసాయం : నిర్మలాసీతారామన్.

♦రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2 లక్షల కోట్లు : నిర్మలాసీతారామన్

♦జాతీయస్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌బోర్డు

♦కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి.

♦ ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూరాయి : నిర్మలాసీతారామన్

♦ 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం

♦బీపీసీఎల్‌, ఎయిరిండియా, ఐడీబీఐ, పైనాన్స్‌ కంటైనర్‌ కార్పొరేషన్లలో పెట్టుబడుల ఉపసంహరణ : నిర్మలాసీతారామన్

♦ఈ ఏడాదిలో ఎల్‌ఐసీ ఐపీవో

♦మూలధన మద్దతు కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20 వేల కోట్లు.

♦బ్యాంకుల మొండి బకాయిల కోసం ఆస్తుల పునర్‌ వ్యవస్థీకరణ సంస్థ ఏర్పాటు.

♦చిన్న సంస్థల నిర్వచనం మార్పు : నిర్మలాసీతారామన్

♦రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకు చిన్నసంస్థలుగా గుర్తింపు.

♦వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు : నిర్మలాసీతారామన్

♦గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి రూ.40 వేల కోట్లు

♦1,000 మండీలు ఈనామ్‌ తో అనుసంధానం : నిర్మలాసీతారామన్

♦రైల్వేలకు రూ.1,10,055 కోట్లు కేటాయింపు.

♦ఒకేదేశం.. ఒకే రేషన్‌కార్డు : నిర్మలాసీతారామన్

♦ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు.

♦వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం : నిర్మలాసీతారామన్

♦కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌ తీసుకోవచ్చు.

♦బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, మిగిలిన సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తిచేస్తాం : నిర్మలాసీతారామన్

♦పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత జాబితా తయారు చేయాలని నీతిఆయోగ్‌కు ఆదేశం : నిర్మలాసీతారామన్.

♦వ్యూహాత్మక 4 రంగాలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ : నిర్మలాసీతారామన్

♦స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరో 100 సైనిక పాఠశాలలు

♦హైదరాబాద్‌లో 40 వరకు ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి : నిర్మలాసీతారామన్

♦దేశవ్యాప్తంగా 9నగరాల్లో ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిని అనుసంధానిస్తూ ప్రత్యేక వ్యవస్థ.

♦సామాజిక భద్రతా పథకాల్లోకి వీధి వ్యాపారులు : నిర్మలాసీతారామన్

♦అంకుర సంస్థల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు.

♦ఏకవ్యక్తి నిర్వహణ సంస్థలకు ప్రోత్సాహకాలు

♦దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ రేషన్ అమలు

♦లేహ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు : నిర్మలాసీతారామన్

♦2020 డిసెంబరు నాటికి విద్యుదుత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు రూ.1.35 లక్షల కోట్లు బకాయి

♦గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు రూ.300 కోట్లు : నిర్మలాసీతారామన్.

♦2021-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతం : నిర్మలాసీతారామన్

♦యువతకు అవకాశాలు పెంచేలా జాతీయ అంప్రెంటీస్ చట్టానికి సవరణలు.

♦జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా 15 వేల పాఠశాలల ఆధునీకరణ

♦నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విధివిధానాలు ఖరారు దశలో ఉన్నాయి.

♦రానున్న ఐదేళ్లలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు రూ.50 వేల కోట్లు

♦డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు : నిర్మలాసీతారామన్.

♦త్వరలో జాతీయ భాషా అనువాద కార్యక్రమం : నిర్మలాసీతారామన్

♦రూ.4 వేల కోట్లతో డీప్ ఓషన్ మిషన్

♦త్వరలో జాతీయ నర్సింగ్, మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు

♦జనాభా లెక్కల కోసం రూ.3,726 కోట్లు : నిర్మలాసీతారామన్

♦దేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనగణన.

♦75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట: నిర్మలాసీతారామన్

♦ఐటీ రిటర్న్ దాఖలకు మినహాయింపు

♦పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here