విజయవాడ : నైపుణ్యాభివృద్ది తోపాటు ఉపాదికల్పనే లక్ష్యం.
విజయవాడ : నైపుణ్యాభివృద్ది తోపాటు ఉపాదికల్పనే లక్ష్యం.

నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు కెరియర్ వాక్ సంయుక్త ఆధ్వర్యంలో గవర్నర్ పేట లోని  సంస్థ కార్యాలయంలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణు గారు మాట్లాడుతూ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలకు తగిన నైపుణ్యాలను గుర్తించి తగిన శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువత చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.ఉద్యోగాలు రాలేదని నిరుత్సాహం చెందకుండా తమ ఆసక్తి కి అనుకూలమైన రంగంలో నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడం ద్వారా త్వరితగతిన ఉద్యోగ అవకాశాలు పొందే వీలు కలుగుతుందన్నారు.600 పై చిలుకు అభ్యర్థనలు హాజరు కాగా , ముఖా ముఖి ఇంటర్వ్యూలు జరగవలసి ఉంది.

ఫోన్ పే,మెడ్ ప్లస్, శ్రీరామ్ లైఫ్, టాబ్స్ బిజినెస్ సోలుషన్స్, ఇన్నొవ్ సోర్స్, శ్రీరామ్ ఫైనాన్స్  తదితర కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ప్రణయ్ పిన్నెంటి, ఏపీ ఎస్ ఎస్ డి సి జిల్లా ప్లేస్మెంట్ ఎక్జిక్యూటివ్ మోహన్ బాబు , జి3 మేనేజర్ డి.శ్రీకాంత్, మరియు కెరియర్  వాక్ సంస్థ అధినేత వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here