నిమ్మగడ్డ రమేష్ కు షాక్ ఇవ్వనున్న ఏపి ప్రభుత్వం...రంగంలోకి దిగిన స్పీకర్ తమ్మినేని సీతారాం.
నిమ్మగడ్డ రమేష్ కు షాక్ ఇవ్వనున్న ఏపి ప్రభుత్వం...రంగంలోకి దిగిన స్పీకర్ తమ్మినేని సీతారాం.

సభా హక్కుల ఉల్లంఘనలు పై రంగంలోకి దిగిన స్పీకర్ తమ్మినేని సీతారాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మడ్డ రమేష్ కుమార్ మధ్య పంచాయతీ ఎన్నికలు రేపిన చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఎస్ఈసీ అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం నిమ్మగడ్డకు కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీపై సభాహక్కుల ఉల్లంఘన చట్టాన్ని ప్రయోగిస్తోంది. ఎస్ఈసీ తమపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పరిశీలించిన తమ్మినేని.. తదుపరి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని అశెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు.ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అందులో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి సహా.. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పాటు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని నిమ్మగడ్డ తన లేఖలో ఆరోపించారు. మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు లక్ష్మణ రేఖ (ఎన్నికల కోడ్) దాడి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని నిమ్మగడ్డ విమర్శించారు.

ఈ లేఖ పై స్పందించిన మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స… సీనియర్ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా బాధ్యతాయుతమై పదవుల్లో ఉన్న తమ హక్కులకు భంగం కలిగించడమే కాకుండా తమ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారని.., ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ రాసిన గవర్నర్ కు రాసిన లేఖలో వేసిన నిందల, ఆరోపణలు తమకు మానసికంగా వేదన కలిగించాయని., బాధించాయని.. నిమ్మగడ్డ చేసిన అసత్యారోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ గౌరవానికి భంగం కలిగిందని.. ఆయననపై చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరారు.

నిమ్మగడ్డ ఇష్యూ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి వెళ్తున్నందున నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here