ప్రాణం తీసిన అనుమానం..!
ప్రాణం తీసిన అనుమానం..!

అనాధలైన ముగ్గురు చిన్నారులు

👉చిత్తూరు జిల్లా కెవిబి పురం మండల కేంద్రంలోని బీసి కాలనీలో హృదయ విధారక ఘటన

🔸ప్రేమించుకున్నారు.ప్రేమను జయించి కులాంతర వివాహం చేసుకున్నారు.వీరి అన్యోన్య దాంపత్యానికి సాక్ష్యంగా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
ఎంతో సంతోషంగా సాగాల్సిన వీరి జీవితంలో అనుమానం పెనుభూతంగా మారింది.

🔸భర్త భార్యపై అనుమానంతో గొంతుకోసి హతమార్చిన హృదయ విధారక ఘటన చిత్తూరు జిల్లా కెవిబి పురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

🔸సూరిబాబు వృత్తిరిత్యా టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.2007
లో సుహాసిని ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు.
భార్య పైఅనుమానంతో సూరిబాబు తరచు గొడవ పడుతుఉండేవాడు.

🔸ఈ క్రమంలో మనస్పర్ధలతో వీరిద్ధరు గత రెండేళ్ళుగా విడిపోయారు.అయితే కుటుంబ పెద్ధలు సర్ధిచెప్పడంతో గత ఆరు‌నెలలు గా కలిసి ఉన్నారు.ఈనేపద్యంలో సూరిబాబు
ఇంటి వద్ధ ఉన్న తన భార్యను అనుమానంతో చాకుతో గొంతు కోసి హత్యచేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

🔸ఈఘటనలో
తీవ్రరక్త స్రావంతో సుహాసిని అక్కడికక్కడే మరణించిందని కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సుహాసిని మరణానికి కారణమైన సూరిబాబును కఠినంగా శిక్షించాలంటూ బంధువులు పోలీస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here