అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈరోజు సచివాలయానికి రానున్నారు. గత ఏడాది డిసెంబర్ 18న కేబినెట్ సమావేశం అనంతరం… సుదీర్ఘ విరామం తరువాత హైపవర్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం కోసం సీఎం సచివాలయానికి వెళ్లనున్నారు.

సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి నిర్వహించనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రులు బుగ్గన, సూచరిత, విశ్వరూప్ హాజరుకానున్నారు. గత కొంత కాలంగా కరోనా, రాజధాని ఉద్యమాల నేపథ్యంలో కేవలం కేబినెట్ సమావేశాల సమయంలోనే సీఎం జగన్ సచివాలయనికి వస్తున్నారు. సచివాలయంలో నేడు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం కావాలని భావించినా ఆ సమావేశం రద్దు అయ్యింది.

నేడు కేబినెట్ లేకపోయిన సచివాలయానికి జగన్ రానున్నారు. ఉదయం 11:00గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సచివాలయానికి చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడే ఉండనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here