ఫుట్‌బాల్ గురించి తెలిసిన వారిని ఒక ఇద్దరు ఆటగాళ్ల పేర్లు చెప్పమంటే.. వారిలో కచ్చితంగా ఉండే పేరు క్రిస్టియానో రొనాల్డో. నేడు ఈ ఫుట్‌బాల్ స్టార్ పుట్టినరోజు. పోర్చుగల్ ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు రొనాల్డో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెషనల్ విభాగంలో ప్రస్తుతం సెరీ A క్లబ్ జువెంటస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రొనాల్డో 1985 ఫిబ్రవరి 5న జన్మించాడు. స్పోర్టింగ్ సీపీ టీమ్ తరఫున ప్రొఫెషనల్ కెరీర్లో అరంగేట్రం చేశాడు. అనంతరం 2003లో మాంచెస్టర్ యునైటెడ్‌కు మారాడు. రొనాల్డో 2003లోనే 18 సంవత్సరాల వయసులో పోర్చుగల్ తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఉత్తమ ఆటతీరుతో 2008లో జాతీయ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఆ దేశం తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 2016లో UEFA యూరోపియన్ ఛాంపియన్షిప్, 2019లో UEFA నేషనల్ లీగ్‌లో తన జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.