India vs England 1st Test Match, Day 1: ఇండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ టీమ్‌.. లంచ్ స‌మ‌యానికి 27 ఓవర్లల్లో 2 వికెట్లు కోల్పోయి 67 ప‌రుగులు చేసింది. ముందుగా.. ఓపెన‌ర్లు రోరీ బ‌ర్న్స్ (33), డోమ్ సిబ్లీ (26 నాటౌట్‌) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్లను మారుస్తూ ఇంగ్లాండ్ జట్టు సభ్యులకు ముప్పుతిప్పలు పెట్టడంలో సఫలమయ్యాడు. దీంతో భోజన విరామ సమయానికి ముందు రెండు ఓవ‌ర్ల వ్యవధిలోనే ఇంగ్లాండ్ టీమ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.

స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 24వ ఓవర్‌లో ఓపెనర్‌ రోరీబర్న్స్‌(33)ను ఔట్‌ కాగా.. 26వ ఓవర్‌లో బుమ్రా.. లారెన్స్‌(0)ను డకౌట్‌ చేసి పెవిలియన్‌‌కు పంపాడు. దీంతో ఇంగ్లాండ్‌ 63 పరుగుల వద్ద రెండు వికెట్లు‌ కోల్పోయింది. క్రీజులో ప్రస్తుతం సిబ్లీ(26), కెప్టెన్ జో రూట్(4)‌ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ భోజన విరామ సమయానికి 27 ఓవర్లలో స్కోర్‌ 67/2 స్కోర్‌ సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here