ఇండియన్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతోంది నోకియా. గతంలోనే యూరప్ మార్కెట్‌లో నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. 2020 సెప్టెంబర్‌లో నోకియా 2.4 మోడల్‌తో పాటు నోకియా 3.4 మోడల్ రిలీజైంది. వీటిలో ఇప్పటికే నోకియా 2.4 ఇండియాలో రిలీజైంది. 3జీబీ వేరియంట్ ధర రూ.10,399. ఇక దీంతో పాటు రిలీజైన నోకియా 3.4 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసేందుకు కసరత్తు చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్… త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అంతేకాదు… మొత్తం స్పెసిఫికేషన్స్‌ని కూడా ప్రకటించేసింది. నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్ కన్నా ధర కాస్త ఎక్కువగా ఉండొచ్చని అంచనా. నోకియా 3.4 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లో కేవలం గూగుల్‌కు సంబంధించిన యాప్స్ మాత్రమే ఉంటాయి. థర్ట్ పార్టీ యాప్స్, బ్లోట్‌వేర్ ఉండదు. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అఫ్‌డేట్స్ లభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here