అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణను  రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌  దేశ వ్యాప్తంగా సేకరిస్తోంది. గత నెల 20 నుంచి నెల 10 వరకు 22 రోజులు పాటు కంటిన్యూగా దేశంలోని మారుమూల గ్రామంలోని  ప్రతి గడపకు వెళ్లి విరాళాలు సేకరించే పనిలో ఉన్నారు రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు.ఊరూరా వాడవాడనా అయోధ్య రామాలయం గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. రామాలయ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీతో పాటు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహిస్తున్నారు. రామాలయ నిర్మానంలో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాలు అందజేసారు.  ఇప్పటికే అయోధ్య రామ మందిర తీర్ధ క్షేత్ర ట్రస్టు.. రూ. 10, రూ. 100, రూ.1000 టోకెన్లు ముద్రణ చేసారు. అయోధ్య రామాలయంలో ప్రతి ఒక్క భారతీయ కుటుంబం భాగస్వామం కావాలనే ఉద్దేశ్యంతో మినిమం రూ. 10 నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. రూ. 2 వేలకు పైగా విరాళాలు అందజేసిన వారికి పన్ను మినహాయింపుకు సంబంధించిన రసీదులు అందజేస్తున్నారు.  ప్రజలు కూడా స్వచ్ఛందంగా రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులకు విరాళాలు అందజేస్తున్నారు.

ఎవరికి తోచినంత వారు ఇవ్వాలని చెబుతున్నారు. రాజకీయ నాయకులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.ఇప్పటికే పవన్ కల్యాణ్ కూడా తన వంతు సాయంగా రూ.30 లక్షల రూపాయలను అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం అందించారు. మరోవైపు హీరోయిన్ ప్రణీత కూడా తన వంతు విరాళం ప్రకటించింది. ఇంకోవైపు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా అయోధ్య రామాయలయం నిర్మాణానికి విరాళం ప్రకటించినా.. ఎంత అని చెప్పలేదు. తాజాగా అయోధ్య రామాలయ నిర్మాణానికి సీనియర్ హీరో నరేష్ .. రూ. 5లక్షల విరాళం అందజేసారు. ఈ విషయాన్ని నరేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here