దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రామ మందిర నిర్మాణం కోసం వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. నకిలీ స్లిప్‌లతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా రామ మందిరం నిర్మాణం పేరిట ప్రజలను మోసం చేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులను (రెండు వేర్వేరు ఘటనలు) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకోగా, మరోకటి బులంద్‌షహర్‌లో జరిగింది. వివరాలు.. క నిందితులు ప్రకాష్ త్రిపాఠి, అశోక్ రాజ్‌పుత్‌లు రామ మందిరం విరాళాల పేరుతో నకిలీ రశీదులు, స్లిప్‌లు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని భజరంగ్‌దల్ స్థానిక కో-కన్వీనర్ కాన్పూర్‌ జిల్లాలోని బర్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ఐపీఎస్ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై కాన్పూర్ ఎస్పీ దీపక్ భుకర్ మాట్లాడుతూ.. నిందితులు ప్రకాష్ త్రిపాఠి, అశోక్ రాజ్‌పుత్‌లు రామ మందిరం నిర్మాణం పేరిట నకిలీ రశీదులు ఇస్తూ నిధులు వసూలు చేస్తున్నరని తెలిపారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని.. విచారణ పూర్తయ్యాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇక, బులంద్‌షహర్‌లో కూడా ఇదే రకమైన కేసు వెలుగుచూసింది. అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పేరిట నకిలీ రసీదులు ముద్రించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ప్రజలను మోసగించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టుగా వెల్లడైంది.. వారిని ప్రారంభ దశలోనే తాము పట్టుకున్నామని బులంద్‌షహర్ ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. నిందుతులను దీపక్ ఠాగూర్, రాహుల్‌గా గుర్తించామని చెప్పారు. అయితే నిందితులు రశీదులను ఎవరి కోసం ముద్రిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు. ప్రిటింగ్ ప్రెస్ యజమాని ఇఖ్లాక్ ఖాన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here