ప్రభుత్వలు చేపట్టే పథకాలు ప్రతిఒక్కరికీ చేరేవిధంగా సేవ భావం తో ముందుకు సాగాలి: గౌతమ్ సవాంగ్

2019 కి చెందిన 10 మంది ఐఏఎస్ అధికారుల బృందం శిక్షణ పూర్తి చేసుకుని విధులలో చేరుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు ఎదురవుతాయి, వాటిని ఏ రకంగా ఎదుర్కొనాలి అనే దానిపై గౌతమ్ సవాంగ్ IPS, యువ IAS అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా పలువురు ఐఏఎస్ అధికారులు తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ అధికారుల పైన ప్రజలకు ఎక్కువ అంచనాలు ఉంటాయి అని, వారికి సేవ చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రజల కోసం ప్రభుత్వలు చేపట్టే పథకాలు ప్రతిఒక్కరికీ చేరేవిధంగా సేవ భావం తో ముందుకు సాగాలని, ఐఏఎస్ అధికారుల బృందం లో మహిళలు ఎక్కువ శాతం ఉండటం అభినందనీయమన్నారు. అదేవిధంగా అంధత్వాన్ని జయించి ఐఏఎస్ కు ఎంపికై వీధుల్లో చేరబోతున్న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కట్ట సింహాచలం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు బరోసా కల్పించేందుకు, వారి రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ చట్టం విధివిధానాలను వారికి వివరించారు.