Take a fresh look at your lifestyle.

beirut explosion: భారీ పేలుళ్లతో భయానకంగా బీరూట్: పిల్లల కోసం పేరెంట్స్, 100మందికిపైగా మృతి(వీడియోస్)

0 35

[ad_1]

భారీ పేలుళ్లతో పెను విధ్వంసం..

పేలుళ్ల ధాటికి భారీ భవనాలు నేలకూలాయి. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక నివాసాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ పెను ప్రమాదం అప్పటి వరకు ఇళ్లల్లో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. పేలుళ్ల ధాటికి ఇళ్లు కదిలిపోయాయి. కిటికీలు ధ్వంసమయ్యాయి. దీంతో ఇళ్లల్లోనే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో వెలుగుచూస్తున్నాయి.

కొడుకు కోసం తండ్రి..

పేలుళ్ల ధాటికి ఒక్కసారిగా ఇళ్లు కంపించడంతో ఓ తండ్రి తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. వెంటనే తన కుమారుడ్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేశాడు. ఓ బల్ల కిందకు కొడుకును తోశాడు. ఆ తర్వాత అతడు కూడా బల్ల కిందకు చేరిపోయాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.

అందమైన యువతి ఫొటోషూట్.. అంతలోనే..

ఇక ఓ అందంగా ముస్తాబైన ఓ యువతి వీధుల్లో ఫోటో షూట్ చేసుకుంటోంది. ఆ సమయంలోనే ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో అక్కడి ప్రాంతమంతా వణికిపోయింది. భూకంపం వస్తుందేమోనని అక్కడ్నుంచి అంతా పారిపోయారు. వీడియో తీసే వ్యక్తి అక్కడి పరిస్థితిని కెమెరాలో బంధించాడు.

పనిమనిషి సాహసం..

మరో ఇంట్లో ఓ ఆఫ్రికన్ పని మనిషి తన పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా పేలుడు ధాటికి ఇంటి అద్దాలు పగిలిపోయాయి. వెంటనే ఆమె తన ప్రాణాలు సైతం లెక్కడ చేయకుండా అక్కడే ఆడుకుంటున్న తన యజమాని కూతురును కాపాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

తన పిల్లల కాపాడుకున్న తల్లి..

కిటికీలోంచి తన పిల్లలతో అందంగా, ఆహ్లాదంగా ఉన్న బయటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న తల్లి.. పేలుళ్ల బీభత్సంతో ఒక్కసారిగా వణికిపోయింది. తన పిల్లలను తన ఒడిలోకి తీసుకుని కాపాడుకుంది. వెంటనే అందర్నీ తీసుకుని లోపలికి పరుగులు తీసింది. అప్పటికే ఆ ఇంటి కిటికీలు ధ్వంసమైపోయాయి.

హృదయ విదారక దృశ్యాలు..

పేలుళ్లతో బీరూట్ నగరంలో హృదయ విదారక దృశ్యాలు ఎన్నో కనిపించాయి. వందమందికిపైగా మృతి చెందగా.. అనేక మంది తీవ్రగాయాలతో ఆర్థనాదాలు చేశారు. పిల్లలు, పెద్దల అరుపులతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారిపోయింది. సహాయక బృందాలు భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటికి తీసి హుటాహుటిన ఆస్పత్రులకు తరలించాయి.

ఎంతో అందంగా ఉన్న నగరం.. పేలుళ్ల తర్వాత శిథిలాల దిబ్బగా..

పేలుళ్లుకు ముందు ఎంతో అందంగా ప్రశాంతంగా ఉన్న బీరూట్ నగరం.. పేలుళ్ల తర్వాత శిథిలాల దిబ్బగా మారిపోయింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భీతావాహ వాతావరణం కనిపించింది.

Nepotism : Nepo Kids పై ఆ వార్తలు రాసే దమ్ము మీకుందా ? : Kangana Ranaut

కన్నీటి పర్యంతమైన బీరూట్ గవర్నర్..

భారీ పేలుళ్లతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని తలచుకుని బీరూట్ గవర్నర్ కన్నీటిపర్యంతమయ్యారు. తమ ప్రజలు పెను విషాదంలోకి నెట్టివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ పేలుళ్ల ప్రభావం 200 కిలోమీటర్ల మేర చూపడం గమనార్హం. పేలుళ్ల కారణంగా సుమారు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాగా, బీరూట్ పోర్టు మొత్తం నాశనమైందని ఆర్థిక మంత్రి తెలిపారు. పోర్టులో నిల్వ చేసిన గోధుమలు, ఇతర ఆహారపదార్థాలు నాశనమయ్యాయని చెప్పారు. దీంతో ప్రస్తుతం ఆహార పదార్థాల కొరత కూడా ఏర్పడిందన్నారు. నగరం కోలుకోవాలంటూ నెలల సమయం పడుతుందని అన్నారు.

[ad_2]

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669