కొండపోచమ్మ ఆలయంలో చండీయాగంలో పాల్గొన్న సిఎం కేసీఆర్‌ ‌దంపతులు

సిద్ధిపేట జిల్లాలోని మర్కూక్‌-‌పాములపర్తిలో నిర్మించిన శ్రీ కొండపోచమ్మ రిజర్వాయర్‌ ‌ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా తొలుత జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని తీగుల్‌నర్సాపూర్‌ ‌గ్రామ శివారులో గల శ్రీ కొండపోచమ్మ వద్ద నిర్వహించిన చండీయాగం, పూర్ణాహుతి కార్యక్రమంలో సిఎం కేసీఆర్‌ ఆయన సతీమణి కె.శోభ పాల్గొన్నారు. ఈ యాగంలో కొండపోచమ్మ ఆలయ ఛైర్మన్‌ ‌రాచమల్ల ఉపేందర్‌రెడ్డి ఆయన సతీమణి సుజాత దంపతులు, సర్పంచి రజిత రమేష్‌ ‌దంపతులు కూడా పాలుపంచుకున్నారు. కాగా, కొండ పోచమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన చండీయాగంకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దంపతులు శుక్రవారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రత్యేక బస్సు ద్వారా దేవాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతులు కొండపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ హోమంలో కేసీఆర్‌ ‌దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు.. సిఎం కేసీఆర్‌ ‌దంపతులకు వేదాశ్వీరచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.

ఆ తర్వాత హోమ నిర్వాహకులు ఉపేందర్‌రెడ్డి, రజిత సిఎం కేసీఆర్‌కు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. చండీయాగం, పూర్ణాహుతి అనంతరం మర్కూక్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు,ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, ఎం‌పీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ ‌రెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి, జగదేవ్‌పూర్‌ ‌జడ్పిటిసి సభ్యుడు వంటేరు సుధాకర్‌రెడ్డి, ఎంపిపి బాలేషంగౌడ్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గూండా రంగారెడ్డి, రైతు సమన్వయ మండల కోర్డినేటర్‌ ‌జంబుల శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షలు కిరణ్‌ ‌గౌడ్‌, ఎం‌పీటీసీలు కవిత శ్రీనివాస్‌ ‌రెడ్డి, కావ్య దర్గయ్య, సర్పంచ్‌లు నరేష్‌, ‌చంద్రశేఖర్‌, ‌పిట్టలరాజు, కుమార్‌, ‌సత్యం, రాజేశ్వరి రవి, భిక్షపతి, జహంగీర్‌, ‌బాల్‌లక్ష్మి ఐలయ్య, నాయకులు సుధాకర్‌ ‌రెడ్డి, మధుసూదన్‌ ‌రెడ్డి, మాసపాక యాదగిరి, సంతోష్‌ ‌రెడ్డి, కరుణాకర్‌, ‌కనకయ్య, భాను, పిట్టల అంజయ్య, గువ్వ రమేష్‌, ‌కనకయ్య తదితరులు పాల్గొన్నారు.