Take a fresh look at your lifestyle.

Comedian Suhas: ఏడేళ్లు ప్రేమించా.. పెళ్లి చేసుకోవాలని ఉదయం అనుకున్నా.. ఆ మధ్యాహ్నమే తాళి కట్టేశా: సుహాస్ లవ్ స్టోరీ – telugu comedian and colour photo movie hero suhas reveals his beautiful love story

0 38

[ad_1]

‘ప్రేమించే పని వదిలేసి కడుపు నింపే పనిచేసే వాళ్లు కొంతమంది.. ప్రేమించే పని ఎప్పటికైనా కడుపు నింపుతుందిలే అని పనిచేసేవాళ్లు ఇంకొంతమంది.. అందులో 90 శాతం మంది సినిమావాళ్లే ఉంటారు.. వాళ్లలో నేనూ ఒకడ్ని’ అంటున్నాడు యాక్టర్ సుహాస్. కళాకారుడు షార్ట్ ఫిల్మ్‌తో పాపులర్ అయిన సుహాస్.. సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ మెల్లమెల్లగా సినిమా అవకాశాలు దక్కించుకున్నాడు. కంటెంట్ ఉన్నోడికి క్యారెక్టర్ దొరకాలే కాని టాలెంటెడ్ నటుడు అనిపించుకోవడానికి ఎక్కువ టైం తీసుకోడనటానికి సుహాస్ పెద్ద ఉదాహరణ.

రీసెంట్‌గా విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలో అద్భుత నటనతో అలరించిన సుహాస్.. అంతకు ముందు దోచెయ్, పడిపడి లేచె మనసు, మజిలీ, ఏజెంట్ ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో నటుడిగా తనను తాను నిరూపించుకుని ఇప్పుడు ‘కలర్ ఫొటో’ చిత్రంతో హీరోగా మారారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌లో తన సహజ నటనతో మెస్మరైజ్ చేశాడు.

రీల్ లైఫ్‌లో ‘కలర్ ఫొటో’ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ముందుకు వస్తున్న సుహాస్‌కి రియల్ లైఫ్‌లోనూ అంతే అద్భుతమైన ప్రేమ కథ ఉంది. ఆ రియల్ లైఫ్ ప్రేమ కథ సుహాస్ మాటల్లో వింటే.. ‘తను డిగ్రీలో నా క్లాస్ మేట్.. 2009 నుంచి ఒకర్నొకరు ఇష్టపడి బాగా కనెక్ట్ అయ్యాం. మేం ఇద్దరం ప్రేమ గురించి స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాం. మా చుట్టూ జరుగుతున్న ప్రేమ కథల్ని చూసేవాళ్లం. ఎవరైనా ప్రపోజ్ చేసినా.. బ్రేకప్ అయిపోవడం.. ఇలాంటివి చూసేవాళ్లం. వాళ్లని చూసి ప్రేమించడం ఎందుకు విడిపోవడం ఎందుకు అని అనిపించేది. ఒకసారి ప్రేమించాం అంటే ఒకర్నొకరు కనెక్ట్ అయితేనే కదా.. మరి విడిపోవడం ఎందుకు వస్తుంది.. అని ఆలోచించేవాళ్లం.

అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత మన మైండ్ సెట్ మారే అవకాశం చాలానే ఉంటుంది. చుట్టూ రకరకాల అమ్మాయిలు ఉంటారు.. కొత్తగా ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. కాని.. నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా తన గురించే ఆలోచించేవాడిని. ఫస్ట్ నుంచి తనే నాకు హెల్ప్ చేసింది. తను జాబ్ చేస్తూ.. మా ఇంట్లో ఒప్పించి నాకు ఫైనాన్సియల్‌గా ఆదుకుంది. మెంటల్‌గా తాను చాలా స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల నేను కెరియర్ గురించి ఆలోచించగలిగా.

నేను ఏం చేసినా.. ‘నువ్ కుమ్మెయ్.. నీ వెనుక నేను ఉన్నా.. మన లైఫ్ చాలా బాగుంటుంది.. కాస్త లేట్ అవుతుంది అంతే’ అని చెప్పేది. తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నా.. తన ఫ్రెండ్స్ పెళ్లికోసం అడిగినా.. అవేం నా దగ్గరకు ప్రస్తావించేది కాదు. వాటిని చెప్తే నేను డల్ అవుతానని ఆలోచించేది. తన లోపల భయపడేది.

తను ఒక్కగానొక్క కూతురు.. పెళ్లి చేసుకోకుండా వాడి కోసం ఎందుకు అలా ఉంటుంది అని అనుకునేవాళ్లు. మా ఇంట్లో కూడా తిట్టేవారు. అయితే ధైర్యం చేసి వాళ్ల పేరెంట్స్ ఇక మేం ఒంటరిగా ఉండాలని అనుకోవడం లేదు.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పగానే.. మేం పెళ్లికి రాము.. మీరైతే వెళ్లి చేసుకోండి అని నాతో పంపించేశారు. ఒక్కర్తే కూతురు.. పైగా నాకు ఉద్యోగం కూడా లేదు.. అందుకే ఆలోచించారు. కాని మేం పెళ్లి చేసుకోవాలని ఆరోజు ఉదయం డిసైడ్ అయ్యాం.. మధ్యాహ్నం చిన్న తిరుపతి వెళ్లి పెళ్లి చేసేసుకున్నాం. ఇప్పుడు వాళ్ల ఇంట్లోని మా ఇంట్లోని కూడా ఓకే’ అంటూ తన బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకులతో పంచుకున్నారు సుహాస్.

Leave A Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/realher1/public_html/wp-includes/functions.php on line 4669