దివ్యాంగుల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే

తూర్పు నియోజకవర్గం లోని దివ్యాంగులకు రాజశ్రీ గార్డెన్‌ ‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో జరిగిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపి పసునూరి దయాకర్‌, ‌మేయర్‌ ‌గుండా ప్రకాశ రావు , దివ్యాంగుల చైర్మన్‌ ‌వాసుదేవ రెడ్డిలు పాల్గొని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్‌ ‌మాట్లాడుతూ కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేదలకు గొప్ప సహాయం చేస్తున్నారన్నారు. రూ.1500, 12 కిలోల బియ్యం పేదలకు ముఖ్యమంత్రి పెద్దమనసుతో అందజేసారన్నారు. వలస కూలీలను సైతం తెలంగాణా పునర్నిర్మాణ భాగస్వామ్యులుగా గుర్తించి వారికిసహాయం అందజేసి వారిని ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలాలకి పంపించా రన్నారు.

నియోజకవర్గ అభివృద్దిలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ ‌రెడ్డి తన వంతు సహకారం అందజేయాలని నరేందర్‌ ‌కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు శామంతుల ఉషశ్రీ శ్రీనివాస్‌, ‌దామోదర్‌ ‌యాదవ్‌, 20‌వ డివిజన్‌ ఇం‌చార్జ్ ‌సిద్దం రాజు, చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ అద్యక్షుడు దిడ్డి కుమారస్వామి, దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అద్యక్షుడు ఎండి.అజీమ్‌, ‌జిల్లా అద్యక్షుడు బండి చక్రపాణి, జిల్లా కార్యదర్శి రాజేందర్‌, ‌రమేష్‌ ‌బాబు, గుండేటి నరేందర్‌, ‌డివిజన్‌ ‌ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.