ఏపీలో రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ల వివరాలివి!

కరోనా ప్రభావం చూపుతున్న విషయాన్ని పలు రాష్ట్రాల్లో పర్యటించి, క్షేత్ర స్థాయిలో కేంద్ర బృందం సమీక్షించిన తరువాత, రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితా ప్రకారం, 130 జిల్లాలు రెడ్ జోన్లుగా, 284 జిల్లాలు ఆరంజ్ జోన్లుగా, 319 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లుగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే…

రెడ్ జోన్ లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలున్నాయి. ఆరెంజ్‌ జోన్ లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలుండగా, ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదుకాని విజయనగరం జిల్లా గ్రీన్ జోన్ లో స్థానం పొందింది.
Tags: Corona Virus, Andhra Pradesh Zones, Red Zone, Green Zone, orange Zone