హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినతరం

హైదరాబాద్: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 27,198 పెటీ కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద 785 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కేసుల్లో రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.