రైతు శ్రేయస్సు కొరకే నూతన వ్యవసాయ విధానం

సన్నరకం ధాన్యం సాగు చేయాలి -ప్రతి రైతుకు రైతుబంధు సాయం : కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ‌రైతుల శ్రేయస్సు కొరకే రాష్ట్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం ప్రవేశ పెట్టిందని జిల్లా కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ అన్నారు. నూతన వ్యవసాయ విధానంపై కాల్వశ్రీరాంపూర్‌ ‌మండలం కునారం, జూలపల్లి మండలం కచాపూర్‌ ‌గ్రామాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ రైతులంతా ఒకే రకం పంట వేయడం వల్ల నష్టపోతున్నా•న్నారు. నియంత్రిత పద్ధతిలో సేధ్యం చేయడం వల్ల వివిధ పంటలు పండించే అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. రైతులు పండించిన పంటకు అధిక లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు దిశగా కృషి చేస్తుందన్నారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేస్తే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాగు భూమిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి జిల్లా వారీగా పంట ప్రణాళిక అందించారన్నారు.

జిల్లాలో ప్రతి 5వేల ఎకరాల క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉన్నారన్నారు. భూసారం, ఎరువులు, విత్తనాలు పండించే పంట సంబంధిత అంశాలపై రైతులకు ఉన్న సందేహాలను వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారన్నారు. వాన కాలంలో సన్నరకం ధాన్యం సాగు దిశగా రైతులు ఆలోచించాలన్నారు. దొడ్డు రకం ధాన్యానికి మార్కెట్లో డిమాండ్‌ ‌లేదన్నారు. వానకాలంలో మక్కల దిగుబడి తక్కువగా వస్తుందని, యాసంగిలో మక్కల సాగు చేయాలని, వానాకాలంలో పత్తి, కందులు, పెసర్లు సాగు చేయాలని కలెక్టర్‌ ‌కోరారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్‌ ఉం‌దన్నారు. కందుల ఉత్పత్తి ఎంత వచ్చినా మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఒకే పంట వేసే క్రమంలో భూసారం తగ్గుతుందని, పంట మార్పిడి విధానం అవలంభించి, ఎరువులను తక్కువగా వినియోగించాలన్నారు. రైతుబంధు వేధిక నిర్మాణం కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించిందని, దాతలు నిధులు లేదా భూమి కేటాయిస్తే ఆ వేధికలకు దాతల పేర్లు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌, ‌ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.