కాకినాడలో కొట్టేశారు.. బందరులో మడతపెట్టేశారు!: దేవినేని ఉమ విమర్శలు

ఏపీలోని కాకినాడలో మడ అడవుల విధ్వంసం మరవక ముందే మచిలీపట్నంలోనూ మడ అడవులను విధ్వంసం చేస్తున్నారంటూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం అడవులను ధ్వంసం చేస్తూ చదును చేస్తే ఎన్నో నష్టాలు ఉన్నాయంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

‘పర్యావరణాన్ని, తీర ప్రాంతాన్ని తుపానుల బారినుండి కాపాడుతున్న”మడ” అడవులను కాకినాడలో కొట్టేశారు.. బందరులో మడతపెట్టేశారు. మీ ప్రభుత్వం చేస్తున్న పర్యావరణ విధ్వంసం నుండి కోర్టులు కాపాడుతున్నాయి. మడ అడవులు మాయం చేస్తున్న బాధ్యులపై ఏ చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారు’ అంటూ దేవినేని ఉమ నిలదీశారు. మడ అడవులు ఎలా నాశనమైపోతున్నాయో తెలిపే ఓ వీడియోను పోస్ట్ చేశారు. అవి నాశనం అయిపోతుండడం వల్ల ఏయే నష్టాలు వస్తాయో అందులో తెలిపారు.
Tags: Devineni Uma, YSRCP, Andhra Pradesh